Asianet News TeluguAsianet News Telugu

TIME: ఈ ఏడాది భార‌త్ నుంచి అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు ద‌క్కించుకుంది వీరే..!

TIME: ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. భారత కుబేరుడు గౌతమ్ అదానీ, సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నంది, కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ టైమ్ మ్యాగజైన్ టాప్-100లో చోటు దక్కించుకున్నారు. కాగా, ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితాను టైమ్ మ్యాగజైన్ 6 కేటగిరీలుగా విభజించింది. టైటాన్స్, ఐకాన్స్, ఆర్టిస్ట్స్, లీడర్స్, పయనీర్స్, ఇన్నోవేటర్స్ పేరిట కేటగిరీలను రూపొందించింది.
 

TIME names these 2 Indians among 100 most influential people in 2022
Author
Hyderabad, First Published May 24, 2022, 5:24 AM IST

TIME: ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. భారత్ నుంచి కుబేరుడు గౌతమ్ అదానీ, సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నంది, కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ టైమ్ మ్యాగజైన్ టాప్-100లో చోటు దక్కించుకున్నారు. అలాగే.. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టీవీ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే పేర్లు ఉన్నాయి. చేర్చబడింది.  ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ 6 కేటగిరీలుగా విభజించింది. టైటాన్స్, ఐకాన్స్, ఆర్టిస్ట్స్, లీడర్స్, పయనీర్స్, ఇన్నోవేటర్స్ పేరిట కేటగిరీలను రూపొందించింది.
 
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల టైమ్స్ జాబితాలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ 13వ సారి నిలిచారు. ఆయనతో పాటు పుతిన్‌ 10వ సారి, బిడెన్‌ ఐదోసారి జాబితాలో స్థానం ద‌క్కించుకున్నారు. గౌతమ్ అదానీ టైటాన్స్ కేటగిరీలో ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఇదే విభాగంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికాకు చెందిన ప్రఖ్యాత బుల్లితెర హోస్ట్ ఓప్రా విన్ ఫ్రే కూడా ఉన్నారు. ఇక, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది కరుణా నంది, హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ లీడర్స్ కేటగిరీలో స్థానం సంపాదించారు. ఇదే కేటగిరీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ, చైనా దేశాధినేత జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి చోటు దక్కడం ఇదే తొలిసారి. 

కాగా, గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా ఉందని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. ఇక, కరుణా నందిపై టైమ్ మ్యాగజైన్ ప్రశంసలు కురిపించింది. ఆమె కేవలం న్యాయవాది మాత్రమే కాదని, ప్రజా ఉద్యమకారిణి అని పేర్కొంది. కోర్టులోనే కాకుండా సమాజంలోనూ మార్పు కోసం ఎలుగెత్తిన ధైర్యశాలి, సమర్థురాలు కరుణా నంది అని వివరించింది. అధ్యక్షుడు జెలెన్స్కీ  గురించి US అధ్యక్షుడు జో బిడెన్ ఇలా రాశారు. అధ్యక్షుడు జెలెన్స్కీలో ఉక్రెయిన్ ప్రజలలో  ధైర్యం నింపిన నాయ‌కుడని కీర్తించారు.   

 పూర్తి జాబితా  ఇదే..    

కళాకారులు: సిము లియు, ఆండ్రూ గార్‌ఫీల్డ్, జోయ్ క్రావిట్జ్, సారా జెస్సికా పార్కర్, అమండా సెయ్‌ఫ్రైడ్, క్వింటా బ్రున్సన్, పీట్ డేవిడ్‌సన్, చానింగ్ టాటమ్, నాథన్ చెన్, మిలా కునిస్, జెరెమీ స్ట్రాంగ్, ఫెయిత్ రింగ్‌గోల్డ్, అరియానా డిబోస్, జాజ్‌మిన్ సుల్లి, జాజ్‌మిన్ సుల్లి.

ఆవిష్కర్తలు: జెండయా, తైకా వెయిటిటి, మిరాండా లాంబెర్ట్, డెరిక్ పామర్ మరియు క్రిస్ స్మాల్స్, జోష్ వార్డిల్, మిచెల్ జౌనెర్, డెమ్నా, టిమ్నిట్ గెబ్రూ, మైక్ కానన్-బ్రూక్స్, బేలా బజారియా, సెవ్‌గిల్ ముసైయేవా, ఫ్రాన్సిస్ కెరెజెర్, మిచెలెజ్, డేవిడ్ కెరెజెర్, డేవిడ్, ఇవాన్ ఐచ్లర్ మరియు ఆడమ్ ఫిలిప్పీ.

టైటాన్స్: టిమ్ కుక్, ఓప్రా విన్‌ఫ్రే, క్రిస్టీన్ లగార్డ్, మిచెల్ యో, గౌతమ్ అదానీ, క్రిస్ జెన్నర్, ఆండీ జాస్సీ, సాలీ రూనీ, హ్వాంగ్ డాంగ్-హ్యూక్, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, మేగాన్ రాపినో, బెకీ సౌర్‌బ్రూన్, మరియు అలెక్స్ మోర్గాన్, ఎలిజబెత్ అలెగ్జాండ్ జస్లావ్.

నాయకులు: మియా మోట్లీ, వోలోడిమిర్ జెలెన్స్కీ, కేతంజీ బ్రౌన్ జాక్సన్, జో రోగన్, జి జిన్‌పింగ్, ఉర్సులా వాన్ డెర్ లేయెన్, రాన్ డిసాంటిస్, జో బిడెన్, యూన్ సుక్-యోల్, వ్లాదిమిర్ పుతిన్, ఒలాఫ్ స్కోల్జ్, సమియా కెవిన్ ఎమ్ కరున్సీ, సమియా కెవిన్ న్ హస్సానీ, అబియ్ అహ్మద్, కిర్‌స్టెన్ సినిమా, గాబ్రియేల్ బోరిక్, ఖుర్రం పర్వేజ్, లెటిటియా జేమ్స్, వాలెరీ జలుజ్నీ, లిన్ ఫిచ్, ఉమర్ అటా బండియల్, సన్ చున్లాన్.

ఐకాన్స్: మేరీ జె బ్లిగే, డిమిత్రి మురాటోవ్, ఇస్సా రే, కీను రీవ్స్, అడెలె, రాఫెల్ నాదల్, మాయా లిన్, జోన్ బాటిస్ట్, నాడిన్ స్మిత్, పెంగ్ షుయ్, హోడా ఖామోష్.

మార్గదర్శకులు: కాండేస్ పార్కర్, ఫ్రాన్సిస్ హౌగెన్, అహ్మీర్ "క్వెస్ట్‌లోవ్" థాంప్సన్, సోనియా గుజాజారా, స్టెఫాన్ బాన్సెల్, ఎమిలీ ఓస్టర్, వాలెరీ మాసన్-డెల్మోట్ మరియు పన్మావో జాయ్, ఎలీన్ గు, టులియో డి ఒలివేరా మరియు సిఖులీల్ బ్యూనిష్ మరియు నాన్ గోల్డ్‌విన్, మాయో, నాన్ , ఎమ్మెట్ షెల్లింగ్, క్రిస్టినా విల్లార్రియల్ వెలాస్క్వెజ్ మరియు అనా క్రిస్టినా గొంజాలెజ్ వెలెజ్, గ్రెగొరీ ఎల్ రాబిన్సన్.

Follow Us:
Download App:
  • android
  • ios