ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ యాప్ ద్వారా విపరీతంగా క్రేజ్ పెంచుకున్నవారు కూడా ఉన్నారు. అలానే విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్  , క్రేజ్ పెంచుకున్న ఓ వ్యక్తి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  టిక్ టాక్ వీడియోల్లో పెద్ద విలన్ లాగా ఫోజులు కొట్టిన అశ్విన్ కుమార్(30) అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు.  వీడియోల్లో ‘విలన్’ వేషాలేసిన ఆయనకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేనప్పటికీ.. తాజాగా 3 హత్య కేసుల్లో అనుమానితుడు కావడం గమనార్హం.

‘‘ నేను అన్నింటినీ నాశనం చేసేస్తా’, ‘ దయ్యం ఇప్పుడు రెడీగా ఉంది’, ‘నే సృష్టించే విలయం చూడండి’ అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ ఉండేవాడు. అశ్విన్ సెప్టెంబర్ 27న స్థానిక బీజేపీ నేత కుమారుడిని, మరో సమీప బంధువునూ ఓ వివాదం నేపథ్యంలో కాల్చి చంపేశాడు.  

తన మాట వినడం లేదని ఓ యువతీ హత్య చేశాడు. వారం రోజులుగా పోలీసులు అన్వేషిస్తుండటంతో భయపడ్డాడు. ఢిల్లీకి పారిపోయేందుకు బస్సు ఎక్కాడు. శనివారం ఆ బస్సును పోలీసులు అడ్డుకున్నారు. భయపడిన అశ్విన్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.