టిబెట్‌లో భూకంపం: 53 మంది మృతి, 60 మందికి గాయాలు

చైనాలోని టిబెట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో కనీసం 53 మంది మరణించగా, 62 మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా నివేదికలు తెలిపాయి.

Tibet Earthquake Death Toll Rises to 53, Over 60 Injured

చైనాలోని టిబెట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో కనీసం 53 మంది మరణించగా, 62 మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా నివేదికలు తెలిపాయి.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:05 గంటలకు (0105 GMT) టిబెట్ అటానమస్ రీజియన్‌లోని షిగజే నగరంలోని డింగ్రి కౌంటీ సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఎవరెస్ట్ ప్రాంతానికి ఉత్తర ద్వారంగా పనిచేసే గ్రామీణ కౌంటీ అయిన టింగ్రిలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో నమోదైంది.

నేపాల్, భూటాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సహా పొరుగు దేశాలలో ప్రకంపనలు వచ్చాయి. భారతదేశంలో, ఢిల్లీ-NCR ప్రాంతంలో, బీహార్ వంటి ఉత్తర రాష్ట్రాలలో భూకంపం గుర్తించబడింది.

భూకంప ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, అనేక ప్రదేశాలలో భవనాలు కంపించాయి. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన నష్టం జరిగిందని టిబెట్‌లోని స్థానిక అధికారులు నివేదించారు, వీటిలో కొన్ని భూకంప కేంద్రానికి 5 కిలోమీటర్ల (3 మైళ్ళు) లోపల ఉన్నాయి. ఈ ప్రాంతాలు అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నాయని CCTV ధృవీకరించింది.

చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) భూకంపం  తీవ్రత , భూకంప కేంద్రాన్ని ధృవీకరించింది, ఇది నేపాల్ సరిహద్దు సమీపంలో సంభవించింది, ఇది భూకంప కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. US జియోలాజికల్ సర్వే (USGS) కూడా నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదించింది, 

ప్రస్తుతం, రెస్క్యూ మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, భారీ నష్టం జరిగిన ప్రాంతాలకు చేరుకోవడంపై  రక్షణ సిబ్బంది దృష్టి సారించారు. కఠినమైన భూభాగం కారణంగా చాలా వేగంగా అక్కడకు చేరుకోవడం కష్టం.

టిబెట్, పొరుగున ఉన్న నేపాల్‌తో పాటు, భారతదేశం యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చురుకైన భూకంప జోన్‌లో ఉంది,

ఈ ప్రాంతం తరచుగా భూకంపాలకు గురవుతుంది. మంగళవారం భూకంపం కూడా తరచూ వచ్చే భూకంపాల్లాగానే వచ్చింది. 2015లో సంభవించిన 7.8 తీవ్రతతో కూడిన ప్రధాన భూకంపం నేపాల్‌ను నాశనం చేసింది, దాదాపు 9,000 మంది ప్రాణాలను బలిగొంది మరియు 22,000 మందికి పైగా గాయపడ్డారు.

గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios