నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Thursday 29th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:34 PM IST

గ్రామ, వార్డు సచివాలయాలకు నిధులు: జగన్

డిసెంబర్ నాటికి జగనన్న కాలనీల్లో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. స్పందనపై గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే సమయంలో సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. 

8:54 PM IST

సోనియాతో సచిన్ పైలట్ భేటీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భేటీ అయ్యారు. రాజస్ధాన్ కొత్త సీఎం ఎంపికపై సోనియా దృష్టి సారించారు. సీఎం రేసులో సచిన్ పైలట్ వున్నట్లుగా సమాచారం. అయితే అంతకుముందు సీఎం అశోక్ గెహ్లాట్ కూడా సోనియాతో భేటీ అవ్వడం రాజస్థాన్‌తో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
8:04 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను కట్టడి చేసేందుకు గాను కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. దీనిలో భాగంగా త్వరలో ఆపరేషన్ రోప్ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు. 

7:09 PM IST

అతి వేగం వల్లే సైరస్ మిస్త్రీ కారుకి ప్రమాదం

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పాల్ఘార్ జిల్లా ఎస్పీ తెలిపారు. నిర్ణీత వేగాన్ని చూసి అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చినట్లు ఆయన చెప్పారు. 

6:26 PM IST

రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే తప్పేంటంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రకు టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రైతుల రూపంలో రావడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నేరుగా టీడీపీ కండువాలు కప్పుకొని రావొచ్చు కదా అని బొత్స వ్యాఖ్యానించారు. 

5:34 PM IST

శ్రీశైల ఆలయ పరిధిలోకి కులసత్రాలు

శ్రీశైల దేవస్థాన ఆధ్వర్యంలోకి కుల సత్రాలను తెస్తామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. వాటిపై దేవస్థానం పర్యవేక్షణ వుండేలా ఓ విధానం తెస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్థానమే కల్పిస్తోందని చెప్పారు. అటు శ్రీశైలం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. 

3:49 PM IST

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్స్ గురువారం కూడా నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409 వద్ద,  నిప్టీ 40 పాయింట్లు నష్టపోయి 16,818 వద్ద స్థిరపడ్డాయి. 

2:46 PM IST

అక్టోబర్ ఫస్ట్ నుండి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి..: కేంద్రం కీలక నిర్ణయం

దేశ ప్రజల భద్రతను ద‌ృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధన, వేరియంట్ తో సంబంధం లేకుండా ఇకపై అన్ని కార్లలో ఎయిర్ బ్యాగ్స్ వుండాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరి ప్రకటించారు. 

1:40 PM IST

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ అరెస్ట్ కు వారెంట్ జారీ

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కు పై రిటైర్డ్ ఆర్మీ జవాన్ శంభు కుమార్ పోలీసులకు  ఫిర్యాదు చేసారు. ఆమె నిర్మించిన ''ఎక్స్ఎక్స్ఎక్స్'' వెబ్ సీరిస్ లో సైనికుల కుటుంబాలను అభ్యంతకరంగా చూపించారంటూ శంభ కుమార్ ఫిర్యాదుచేసారు. దీంతో ఏక్తా కపూర్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 

1:03 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్... రేపే నామినేషన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నకల్లో పోటీ చేస్తున్నట్లు సినియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసారు. ఏఐసిసి కార్యాలయానికి విచ్చేసిన ఆయన నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. రేపు (శుక్రవారం) నామినేషన్ దాఖలుచేయనున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. 

12:08 PM IST

సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ హ్యాట్రిక్

 సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో అఖిలేష్ ఒక్కరే పోటీకి నిలిచారని... దీంతో అయనే మరోసారి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ఎస్పీ సెక్రటరీ జనరల్ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. 

10:57 AM IST

గంజాయి స్మగ్లింగ్ లో ఏపీ టాప్..; నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక వెల్లడి

గంజాయి సరఫరాలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక బట్టబయలు చేసింది. దేశంలో గతేడాది ఏడులక్షల కిలోల గంజాయి పట్టుబడితే అందులో అత్యధికంగా ఏపీ నుండే రెండు లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండోస్థానంలో ఒడిషా నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల నుండే 50 శాతం గంజాయి పట్టుబడినట్లు నివేదిక వెల్లడించింది. ఇక హెరాయిన్ కేసుల్లో మొదటి స్థానంలో గుజరాత్, రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్ నిలిచింది. 

10:24 AM IST

భారత్ లో కొత్తగా 4,272 కరోనా కేసులు, 27 మరణాలు..: కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 4,272 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో బాదపడుతూ చికిత్స పొందుతున్న వారిలో 27 మంది మృతిచెందారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,83,360 కు చేరితే మొత్తం మరణాల సంఖ్య 5,28,611 చేరింది. ప్రస్తుతం దేశంలో 40,750 కరోనా యాక్టివ్ కేసులు వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
9:50 AM IST

హైదరాబాద్ టీ20 టికెట్ల వివాదం... హెచ్సిఏ పై మరో పోలీస్ కేసు

ఇటీవల హైదరాబాద్ వేదికగా భారత్-ఆసిస్ మధ్య టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిందంటూ సిసిఎస్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పటివరకు హెచ్సిఎ పై నమోదయిన కేసుల సంఖ్య 4కు చేరింది. 

9:41 AM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా వున్న 269 పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
 
9:34 PM IST:

డిసెంబర్ నాటికి జగనన్న కాలనీల్లో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. స్పందనపై గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే సమయంలో సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. 

8:54 PM IST:

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భేటీ అయ్యారు. రాజస్ధాన్ కొత్త సీఎం ఎంపికపై సోనియా దృష్టి సారించారు. సీఎం రేసులో సచిన్ పైలట్ వున్నట్లుగా సమాచారం. అయితే అంతకుముందు సీఎం అశోక్ గెహ్లాట్ కూడా సోనియాతో భేటీ అవ్వడం రాజస్థాన్‌తో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
8:04 PM IST:

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను కట్టడి చేసేందుకు గాను కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. దీనిలో భాగంగా త్వరలో ఆపరేషన్ రోప్ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు. 

7:09 PM IST:

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పాల్ఘార్ జిల్లా ఎస్పీ తెలిపారు. నిర్ణీత వేగాన్ని చూసి అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చినట్లు ఆయన చెప్పారు. 

6:26 PM IST:

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే తప్పేంటంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రకు టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రైతుల రూపంలో రావడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నేరుగా టీడీపీ కండువాలు కప్పుకొని రావొచ్చు కదా అని బొత్స వ్యాఖ్యానించారు. 

5:34 PM IST:

శ్రీశైల దేవస్థాన ఆధ్వర్యంలోకి కుల సత్రాలను తెస్తామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. వాటిపై దేవస్థానం పర్యవేక్షణ వుండేలా ఓ విధానం తెస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్థానమే కల్పిస్తోందని చెప్పారు. అటు శ్రీశైలం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. 

3:49 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్స్ గురువారం కూడా నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409 వద్ద,  నిప్టీ 40 పాయింట్లు నష్టపోయి 16,818 వద్ద స్థిరపడ్డాయి. 

2:46 PM IST:

దేశ ప్రజల భద్రతను ద‌ృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధన, వేరియంట్ తో సంబంధం లేకుండా ఇకపై అన్ని కార్లలో ఎయిర్ బ్యాగ్స్ వుండాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరి ప్రకటించారు. 

1:40 PM IST:

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కు పై రిటైర్డ్ ఆర్మీ జవాన్ శంభు కుమార్ పోలీసులకు  ఫిర్యాదు చేసారు. ఆమె నిర్మించిన ''ఎక్స్ఎక్స్ఎక్స్'' వెబ్ సీరిస్ లో సైనికుల కుటుంబాలను అభ్యంతకరంగా చూపించారంటూ శంభ కుమార్ ఫిర్యాదుచేసారు. దీంతో ఏక్తా కపూర్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 

1:03 PM IST:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నకల్లో పోటీ చేస్తున్నట్లు సినియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసారు. ఏఐసిసి కార్యాలయానికి విచ్చేసిన ఆయన నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. రేపు (శుక్రవారం) నామినేషన్ దాఖలుచేయనున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. 

12:08 PM IST:

 సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో అఖిలేష్ ఒక్కరే పోటీకి నిలిచారని... దీంతో అయనే మరోసారి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ఎస్పీ సెక్రటరీ జనరల్ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. 

10:57 AM IST:

గంజాయి సరఫరాలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక బట్టబయలు చేసింది. దేశంలో గతేడాది ఏడులక్షల కిలోల గంజాయి పట్టుబడితే అందులో అత్యధికంగా ఏపీ నుండే రెండు లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండోస్థానంలో ఒడిషా నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల నుండే 50 శాతం గంజాయి పట్టుబడినట్లు నివేదిక వెల్లడించింది. ఇక హెరాయిన్ కేసుల్లో మొదటి స్థానంలో గుజరాత్, రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్ నిలిచింది. 

10:24 AM IST:

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 4,272 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో బాదపడుతూ చికిత్స పొందుతున్న వారిలో 27 మంది మృతిచెందారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,83,360 కు చేరితే మొత్తం మరణాల సంఖ్య 5,28,611 చేరింది. ప్రస్తుతం దేశంలో 40,750 కరోనా యాక్టివ్ కేసులు వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
9:50 AM IST:

ఇటీవల హైదరాబాద్ వేదికగా భారత్-ఆసిస్ మధ్య టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిందంటూ సిసిఎస్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పటివరకు హెచ్సిఎ పై నమోదయిన కేసుల సంఖ్య 4కు చేరింది. 

9:41 AM IST: