కబాబ్ రుచి నచ్చలేదని.. వంటవాడిని కాల్చిచంపిన దుండగులు..

ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట విలాసవంతమైన కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నారు. కబాబ్‌ల రుచి తమకు నచ్చ లేదని దుకాణ యజమాని అంకుర్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తిని కాల్చి చంపారు.

thugs shot the cook because they did not like the taste of the kebab in uttarpradesh - bsb

ఉత్తరప్రదేశ్ : కబాబ్‌లు రుచికరంగా లేవని... 52యేళ్ల కబాబ్ కుక్ ను కాల్చి చంపారు కొందరు దుండగులు.  కబాబ్ ల నాణ్యత తక్కువగా ఉందన్న కారణంతో వారు ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 52 ఏళ్ల కబాబ్ తయారీదారుడు చనిపోయినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

బరేలీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రియదర్శిని నగర్‌లో ఉన్న ఓ పాత కబాబ్ దుకాణంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సిటీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ భాటి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట దుకాణానికి వచ్చారు. నిందితులు విలాసవంతమైన కారులో వచ్చారని.. మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. కబాబ్‌ల రుచి తమకు నచ్చడం లేదని దుకాణ యజమాని అంకుర్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేశారు.

మూడో భార్యను కిరాతకంగా కొట్టి చంపిన భర్త.. తన మద్యం తాగిందన్న కోపంతో దారుణం..

వాగ్వాదం పెరగడంతో, ఇద్దరు అంకుర్ సబర్వాల్‌పై దాడి చేసి,  డబ్బులు ఇవ్వకుండా తమ కారు వద్దకు వెళ్లారు. దీంతో అంకుర్ సబర్వాల్ వారి నుండి రూ.120 వసూలు చేయడానికి నసీర్ అహ్మద్‌ ను పంపించాడు. వారిలో ఒకరు అతనిని కాల్చి చంపాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి వెంటనే పారిపోయారని చెప్పాడు.

కాగా, ఈ దాడి జరుగుతున్న సమయంలో సిబ్బంది కొంతమంది ఈ కారు ఫొటోలు తీశారు. ఈ ఫొటోల ఆధారంగా కారు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. "కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి హంతకులను గుర్తించాం. పోలీసులు గుర్తు తెలియని దుండగులపై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు" అని ఎఎస్ పి భాటి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios