కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాల డిమాండ్

రైతులతో ముగ్గురు మంత్రుల భేటీ: తొమ్మిదోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు


న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలో శుక్రవారం నాడు కేంద్ర మంత్రులు శుక్రవారం నాడు మరోసారి చర్చలు ప్రారంభించారు.

న్యూఢిల్లీలోని విజ్థాన భవన్ లో రైతు సంఘాలతో కేంద్రమంత్రులు చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చిస్తున్నారు.

కనీస మద్దతు ధరపై చట్టభద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతు సంఘాలతో కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది దఫాలు చర్చించారు. ఇవాళ నిర్వహిస్తున్న చ ర్చలు తొమ్మిదో విడత చర్చలు.

కేంద్ర ప్రభుత్వం,రైతు సంఘాల మధ్య చర్చలకు గాను సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నుండి భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు భూపీందర్ సింగ్ వైదొలగారు.

రైతులకు మద్దతుగా రైతులకు సంఘీభావంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. కిసాన్ అధికార్ దివస్ గా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు పాటిస్తోంది. రైతుల నిరసనకు మద్దతుగా రాష్ట్ర రాజధానుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.