Asianet News TeluguAsianet News Telugu

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత

భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

three terrorists killed in gun fire; ammunition ceased
Author
New Delhi, First Published Sep 28, 2019, 3:00 PM IST

న్యూఢిల్లీ: శనివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని నారంగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు చనిపోయిన ఈ ముగ్గురు తీవ్రవాదులు భారతీయులు కారని తెలియవస్తోంది. పాకిస్తాన్ నుండి అక్రమ చొరబాటుదారులుగా వీరిని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. 

ఈ ఎన్ కౌంటర్ ముగియగానే వారివద్ద నుండిభారీ స్థాయిలో ఆయుధాలను భారత సైన్యం పట్టుకుంది. తుపాకులు, గ్రనేడ్లు, తూటాలు ఇత్యాదులను స్వాధీనపరుచుకున్నారు. అధునాతన ఏకే 47 తుపాకులు వాటి మ్యాగజీన్లు కూడా లభ్యమైనట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. 

ఈ ఎన్ కౌంటర్ పూర్తవగానే భారీ సెర్చ్ ఆపరేషన్ ని భారత సైన్యం ఆ ప్రాంతంలో మొదలుపెట్టింది. ట్రాఫిక్ ను కూడా ఆ ప్రాంతంలో కొద్దిసేపు నిలిపేసి మరీ ఆ ప్రాంతాన్ని జెల్లడ పట్టారు భద్రతా బలగాలు. వేరే ఎవరన్నా ఉగ్రవాదులు పారిపోయి తప్పించుకున్నారేమో అని తెలుసుకునేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్టు భద్రతా బలగాల ప్రతినిధి ఒకరు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios