విద్యార్థినిని బెదిరించి సామూహిక లైంగిక దాడి జరిపిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. కల్లకురిచ్చి జిల్లా తిరునావలూరుకు చెందిన పదమూడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు చెన్నైలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న ఈ బాలికతో, 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.


ఈ క్రమంలో విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితులు సైతం ఆమెపై అత్యాచారం జరిపారు. అంతేగాక అసభ్య వీడియోలు బయటపెడతామంటూ బెదిరించి పలుమార్లు అకృత్యానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉళుందూరుపేట మహిళా పోలీసులు ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో వున్న మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు.