న్యూడిల్లీ: ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా ఓ లారీ డ్రైవర్ పై కూడా దాడిచేసి డబ్బులు దోచుకున్నారు ముగ్గురు యువకులు. శనివారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు ఒక్కరే. ఈ ఘటనలు దక్షిణ డిల్లీలో  చోటుచేసుకున్నారు.  
 
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత గురువారం అర్ధరాత్రి సమయంలో యోగేశ్(26), నవీన్(25), బల్జీత్(30) ఓ యువకుడితో గొడవ పడ్డారు. అయితే సదరు యువకుడి సోదరి ఈ ముగ్గురుని అడ్డుకుని సోదరున్ని కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో వీరు దారుణానికి ఒడిగట్టారు. సోదరుడి ముందే యువతి(25)ని బలత్కరించడానికి ప్రయత్నించారు. ఆమె ఒంటిపై వున్న బట్టలను చించేసి అత్యాచారానికి ప్రయత్నించారు. 

యువకుల భారీనుండి ఎలాగోలా యువతి తప్పించుకుంది. దీంతో అక్కడి నుండి వెళ్లిపోయిన ఈ ముగ్గురు యువకులు ఓ లారీ డ్రైవర్ ను చితకబాది రూ.30వేలు దోచుకున్నారు.  యువతితో పాటు  లారీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యాచారయత్నం, ఛోరీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు  చేశారు పోలీసులు.