జార్ఖండ్ లో ఇవాళ ఉదయం నుండి భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎన్కౌంటర్ జరుగుతోంది. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోలు చనిపోయినట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజామున 6గంటలకు కాల్పులు ప్రారంభమవగా ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

జార్ఖండ్ పోలీసులు, సీఆర్‌పిఎఫ్ జవాన్లు కలిసి గుమ్లా ఏరియాలో తనిఖీలు చేపడుతుండగా మావోయిస్టుల దళం తారసపడింది. దీంతో మవోలు భద్రతా దళాలపైకి కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూడా ఎదురు  కాల్పులకు దిగడంతో హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగింది.  అయితే ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోలు చనిపోయినట్లు గుర్తించామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. 

ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  అలాగే  సంఘటనా స్థలం నుండి రెండు ఏకే-47 రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.