Asianet News TeluguAsianet News Telugu

జైపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

వీరు ముగ్గురు కారులో.. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తుండగా.. వారి వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీ కొట్టింది. 

Three killed in accident on Jaipur-Delhi highway
Author
Hyderabad, First Published Sep 25, 2021, 10:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన  జైపూర్- ఢిల్లీ జాతీయ రహదారిపై కోట్పూటి వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఒక గన్ మెన్ కూడా ఉండటం గమనార్హం.  మృతులు దిలీప్ సింగ్ యాదవ్(35), రాఘేవేంద్ర యాదవ్(29), శివమ్ యాదవ్(34) గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రం బిండ్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

వీరు ముగ్గురు కారులో.. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తుండగా.. వారి వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో.. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ని ఢడీ కొట్టింది. ఈ క్రమంలో మరో కంటైనర్ ట్రక్కు వచ్చి వారు వాహనాన్ని దూసుకుంటూ వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

వెంటనే గమనించిన స్థానికులు కారులోనివారిని కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించి.. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రికి వెళ్లేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీ వార్డ్ లో భద్రపరిచారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios