Asianet News TeluguAsianet News Telugu

పాక్​ భూభాగంలోకి.. బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్.. ముగ్గురు ఐఏఎఫ్ అధికారులపై వేటు

పాకిస్థాన్​ భూభాగంలోకి బ్రహ్మోస్​ క్షిపణి పొరపాటున దూసుకెళ్లేందుకు బాధ్యులుగా ఐఏఎఫ్ చెందిన 
ముగ్గురు ఉన్నతాధికారులపై కేంద్రం వేటు వేసింది. ఇందులో  ఐఏఎఫ్ కు చెందిన గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్​ను శాశ్వతంగా విధులను నుంచి తొల‌గించింది.  

Three IAF officers Sacked For BrahMos Missile Misfire over Pakistan
Author
Hyderabad, First Published Aug 24, 2022, 12:09 AM IST

కొన్ని నెలల క్రితం రష్యా క్షిపణులు ఉక్రెయిన్‌ను ధ్వంసం చేస్తున్న వేళ..  అకస్మాత్తుగా ఓ రోజు భార‌త్ కు చెందిన బ్రహ్మోస్​ క్షిపణి పొరపాటున పాకిస్థాన్​ భూభాగంలోకి దూసుకెళ్లింది. అది కూడా చిన్న విషయమేమీ కాదు.. అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్ పాక్ భూభాగంలోకి దూసుకెళ్లింది.

ఆ క్షిప‌ణిలో అణు వార్‌హెడ్‌లు కూడా లోడ్ చేయ‌బ‌డి ఉన్నాయి. భారత సూపర్-డిస్ట్రాయర్ క్షిపణి బ్ర‌హ్మోస్ .. ఒక‌టి కాదు.. రెండు కిమీ కాదు.. పాకిస్థాన్ భూభాగంలో ఏకంగా 124 కిమీలోకి చొచ్చుకుపోయిందని, దాని మొత్తం నిఘా వ్యవస్థ విఫలమైందని నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవ‌ల ఈ విష‌యంపై పాకిస్తాన్ నాయకులు, ప్రజలు సోషల్ మీడియాలో భారత్‌పై నిప్పులు చెరుగుతున్నారు. 

 మార్చి 9వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ప్ర‌మాద‌శాత్తు.. ఓ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోకి ప్ర‌యోగించ‌బ‌డింది. అయితే.. ఎలాంటి ప్రాణ న‌ష్టం గానీ, ఆస్తి నష్టం కూడా జ‌ర‌గ‌లేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న రక్షణ శాఖ.. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘ‌ట‌నపై అప్పట్లోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పార్లమెంట్‌లో ఓ ప్రకటన కూడా చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌త్యేక దర్యాప్తు కమిటీని నియ‌మించారు. ఈ క‌మిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మార్చి 9న  ప్ర‌మాద‌శాత్తు.. ఓ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాన్సిన్ లోకి ప్ర‌యోగించ‌బ‌డింద‌ని తెలిపారు. ఈ ఘటనను బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులను ప్రభుత్వం తొలగించింది. ఇప్పటి వరకు దుష్ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ ప్రజలకు కూడా ఈ చర్య సమాధానం ఇచ్చింది. ప్రపంచానికి భారతదేశం బాధ్యతాయుతమైన దేశం అనే సందేశం పంపబడింది.

మార్చి 9న ప్రమాదవశాత్తు బ్రహ్మోస్ క్షిపణిని ప్ర‌యోగించ‌డంపై కేంద్రం ప్ర‌భుత్వం ఉన్నత‌ స్థాయి విచారణ క‌మిటీని నియ‌మించింది. ఈ నివేదిక ప్ర‌కారం.. బాధ్యులైన ముగ్గురు వైమానిక దళ అధికారులను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తొలగించింది. ఈ అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని పాటించడం లేదని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ గుర్తించింది. తక్షణమే వారి సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆగస్టు 23న అధికారులను డిస్మిస్ చేయాలని ఆదేశించింది. సర్వీస్ నుండి తొలగించబడిన అధికారులలోఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన‌ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు.
 
ఆ క్షిప‌ణిని మధ్యలో ఆపలేమా?

భారత్‌ వైపు నుంచి పొరపాటున బ్రహ్మోస్‌ వెళ్తే.. దాన్ని ఎందుకు మధ్యలోనే ఆపలేదని పాకిస్థాన్ జ‌నాలు సోషల్ మీడియాలో ప్ర‌శ్నాల వ‌ర్షం కురిపిస్తున్నారు. బ్రహ్మోస్ లాంటి వ్యూహాత్మక క్షిపణి మిస్సైల్ ను మధ్యలో ఆపలేమని భారత వైమానిక దళం వర్గాలు తెలిపాయి. బ్రహ్మోస్‌లో 'సెల్ఫ్ డిస్ట్రాక్ట్ మెకానిజం' లేదనీ, కేవలం అగ్ని, పృథ్వీ వంటి బాలిస్టిక్ క్షిపణుల్లో మాత్రమే  'కిల్ స్విచ్' ఉంటుందని అధికారులు తెలిపారు. 

పరాభవం రాకుండా పాక్ డ్రామా

నిజానికి పాకిస్థాన్ ఆగ్రహానికి కారణం వేరే ఉంది. ఆ రోజు పాకిస్తాన్‌లోని మియాన్ చన్ను ప్రాంతంలో బ్రహ్మోస్ పతనంలో ఎవరూ చనిపోలేదు, కానీ ప్రపంచంలో తనకు అవమానం జరగకుండా ఉండటానికి, పాకిస్తాన్ సైన్యం ఈ క్షిపణిని ట్రాక్ చేస్తోందని, నిజం అందరికీ తెలుసునని పాకిస్తాన్ ప్రచారం చేసింది. తర్వాత పాకిస్థాన్ రివర్స్ ఇంజినీరింగ్ చేస్తానని చెప్పడం ప్రారంభించింది. అందుకే పాకిస్థాన్ నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండిపోయింద‌ని తెలుస్తుంది. బ్రహ్మోస్ పూర్తిగా ధ్వంసం అయి.. ఉండ‌వ‌చ్చ‌నీ,  దానిని కాపీ చేయడానికి ఏమీ మిగిలి ఉండదని నిపుణులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios