అరుణాచల్ ప్రదేశ్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. గత కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజు భయంతో వణికిపోయారు.

అరుణాచల్ ప్రదేశ్  రాష్ట్రంలోని ఈస్ట్ కామెంగ్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం బొందిలకు ఈశాన్యంలో 64కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.