మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ముగ్గురు పిల్లలు ఓ కారులో శవమై తేలారు. ఈ ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కారు(suv)లో సోదరిసోదరుడు సహా ముగ్గురు పిల్లలు శవమై కనిపించారు. ఈ మేరకు ఓ పోలీసులకు కుటుంబీలకు సమాచారం అందించారు. మృతులను ఫరూఖ్ నగర్‌కు చెందిన తౌఫిక్ ఫిరోజ్ ఖాన్ (4), అలియా ఫిరోజ్ ఖాన్ (6), అఫ్రీన్ ఇర్షాద్ ఖాన్ (6)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్నారులు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. పిల్లలు సమీపంలోని మైదానంలో ఆడుకోవడానికి వెళ్లారని తల్లిదండ్రులు భావించారు. సాయంత్రం వరకు పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు. కానీ వారికి ఆ పిల్లల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించి కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒక కానిస్టేబుల్ వారి ఇళ్ల సమీపంలో పార్క్ చేసిన SUV కారు ను గుర్తించారు. కారులోకి తొంగి చూడగా అందులో ముగ్గురు పిల్లల మృతదేహాలు కనిపించాయి. తౌఫిక్,ఆలియా తోబుట్టువులు కాగా, అఫ్రీన్ సమీపంలో నివసించినట్లు అధికారి తెలిపారు. పిల్లల మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక వెల్లడిస్తుందని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.
ప్రాణం తీసిన ప్రేమ..
ఇదిలావుండగా.. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని కొట్టి చంపిన ఉదంతం లాతూర్‌లో వెలుగు చూసింది. ఈ ఘటన పక్షం రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఔసా తహసీల్‌కు చెందిన బలిరామ్ మగర్ (25)ని తన ప్రియురాలి గ్రామానికి (భాదా) చెందిన వ్యక్తి జూన్ 3న చర్చ కోసం పిలిచాడని, ఆపై అతను తన కుటుంబ సభ్యులతో కలిసి బలిరామ్‌ను దారుణంగా కొట్టాడని పోలీసు అధికారి తెలిపారు. శనివారం రాత్రి బలిరాం మృతి చెందాడు. జూన్ 9న దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జూన్ 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామీణ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు బలిరామ్‌ను కొట్టినట్లు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అప్పాసాహెబ్ డోంగ్రే తెలిపారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశాం. హత్య కేసు విచారణ జరుగుతుందని తెలిపారు.
18 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో 18 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు 19 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదును ఉటంకిస్తూ.. నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలిక చదువు కోసం లాతూర్‌కు వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెతో నిందితుడు స్నేహం చేసి.. ఆమెతో సంబంధాన్ని పెంచుకున్నాడు.
ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె అభ్యంతరకర చిత్రాలను క్లిక్ మనిపించాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నిత్యం వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు చివరకు ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
