తమిళనాడులో విషాదం.. రైలు ఢీ కొని ముగ్గురు చిన్నారులు మృతి..

తమిళనాడులో వేగంగా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చెవిటి, ఒకరు మూగ.

Three children died after being hit by a train in Tamil Nadu - bsb

తమిళనాడు : తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో వినికిడి, మాట్లాడే లోపమున్న ముగ్గురు చిన్నారులు  రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో చనిపోయారు. లోకోపైలెట్ హారన్ కొట్టినా వారికి వినిపించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు సురేష్‌ (15), అతని సోదరుడు రవి (12), మంజునాథ్‌ (11)లు కర్ణాటక వాసులు. దసరా పండుగ సెలవుల సందర్భంగా చెన్నై సమీపంలోని ఉరపాక్కంలో పని చేస్తున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. “సురేష్, రవికి వినికిడి లోపం ఉంది. వారి స్నేహితుడు మంజునాథ్ మాట్లాడలేడు. వీరు ముగ్గురూ... మంగళవారం తల్లిదండ్రులు పనికి వెళ్లిన తరువాత టిఫిన్ చేయడం కోసం బయటకు వెళ్లి, ఆ తరువాత ఆడుకోవడానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌ దగ్గరికి వెళ్లారు ”అని ఒక అధికారి తెలిపారు.

ఆసియా పారా గేమ్స్ 2023 : జావెలిన్ లో సుమిత్ యాంటిల్ కి స్వర్ణం.. కొత్త ప్రపంచ, పారా ఆసియా క్రీడల రికార్డు...

ముగ్గురూ రైల్వేట్రాక్ దాటబోతుండగా, ఉదయం 11.45 గంటల ప్రాంతంలో చెంగల్‌పట్టు నుంచి తాంబరం వైపు వెళ్తున్న సబర్బన్ ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) సిబ్బంది వారి మృతదేహాలను ట్రాక్‌పై నుండి, పోస్ట్‌మార్టం నిమిత్తం క్రోమ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. వండలూరు,  ఉరపాక్కం మధ్య రైల్వే స్ట్రెచ్‌కు ఎలాంటి గోడ రక్షణ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios