New Delhi: నౌరుతి ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ అధికారి కుమారుడి అరెస్ట్ అయ్యాడు. నైరుతి ఢిల్లీలో భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారి కుమారుడు నడుపుతున్న కారు ఢీకొని మైనర్ బాలిక మృతి చెందిందనీ, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Minor girl killed in road accident: దేశ రాజధాని ఢిల్లో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ అధికారి కుమారుడి అరెస్ట్ అయ్యాడు. నైరుతి ఢిల్లీలో భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారి కుమారుడు నడుపుతున్న కారు ఢీకొని ముడున్నరేండ్ల బాలిక మృతి చెందిందనీ, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే. నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో భారత వైమానిక దళ సీనియర్ అధికారి కుమారుడు నడుపుతున్న కారు ఢీకొని మూడున్నరేళ్ల బాలిక మృతి చెందింది. నిందితుడు ఓ ప్రయివేటు కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడనీ, ఆదివారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ కంటోన్మెంట్ లోని అర్జున్ విహార్ నివాసి అయిన బాలిక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి చేరుకునే సరికి బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కారు అతివేగంగా ప్రయాణిస్తూ నడిరోడ్డుపై వచ్చిన బాలికను ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ లోని అర్జన్ విహార్ కు చెందిన హ్యుందాయ్ క్రెటాను అదుపులోకి తీసుకునీ, దాని డ్రైవర్ సమర్క్ మాలిక్ (20)ను పోలీసులు అరెస్టు చేశారు. సమార్క్ ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ కుమారుడని పోలీసులు తెలిపారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 279 (రాష్ డ్రైవింగ్ లేదా పబ్లిక్ వేపై రైడింగ్), 304ఏ (నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలిక్ మొదట గాయపడిన బాలికను, ఆమె కుటుంబాన్ని ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడని, అక్కడి నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడనీ, అక్కడ బాధిత బాలిక మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి అర్జన్ విహార్ ప్రాంతంలో పనిమనిషిగా పనిచేస్తుండగా, తండ్రి ఒక ప్రయివేటు ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.
అతివేగానికి గతవారం నలుగురు మృతి
గతవారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ఆనంద్ పర్వత్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగిందనీ, ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. రోడ్డుపై పని చేస్తున్న కూలీలు, చిన్నారులను ఎంసీడీ ట్రక్కు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అతి వేగమే దీనికి కారణమని గుర్తించారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పిందనీ, అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
