ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ఏకంగా ఎన్ఐఏ కార్యాలయానికి లేఖ రావడం కలకలం రేపుతోంది. మోడీని చంపేందుకు 20 కేజీల ఆర్డీఎక్స్, 20 మంది స్లీపర్ సెల్స్‌ని సిద్ధం చేశామని ఆగంతకులు పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ప్రధాని నరేంద్ర మోడీని (pm narendra modi) చంపేస్తామంటూ ముంబైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ (threatening email ) రావడం కలకలం రేపుతోంది. మోడీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేశామని.. ఆగంతకులు మెయిల్ చేశారు. ఇందుకోసం 20 కిలోల ఆర్డీఎక్స్ సిద్ధం చేశామని మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది.