Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ.. 50 కోట్లు డిమాండ్, 48 గంటలు డెడ్‌లైన్

ఇటీవలి కాలంలో ప్రముఖులకు బెదిరింపులు రావడం ఎక్కువైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. 48 గంటల్లో రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

threat letter to industrialist Naveen Jindal
Author
First Published Jan 24, 2023, 7:00 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు అందులో డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని పాత్రపాలిలో వున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఫ్యాక్టరీకి గతవారం పోస్ట్ ద్వారా ఓ లేఖ వచ్చింది. దానిని తెరిచిచూడగా.. నవీన్ జిందాల్ 48 గంటల్లోగా రూ.50 కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ లేఖ.. బిలాస్‌పూర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ దీనిని పంపినట్లుగా తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు.. నిందితుడి గుర్తింపుపైనా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

ఇదిలావుండగా.. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. డిమాండ్ చేసిన మొత్తాన్ని అందించాలని, లేదంటే ఆఫీసునే పేల్చేస్తామని ఆ కాలర్ వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా, ఆ కాలర్ ఓ ఖైదీ అని, కేంద్ర మంత్రికి ఆ బెదిరింపు కాల్స్ ఓ జైలు నుంచి చేశాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నిందితుడు తనని తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్నాడు. 

Also Read: జైలు నుంచి కేంద్రమంత్రికి బెదిరింపు కాల్స్.. ‘మర్డర్ కేసు నిందితుడు 3 సార్లు కాల్ చేశాడు’

మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆ నిందితుడు మూడు సార్లు మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసుకు బెదిరింపు కాల్స్ చేశాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడినని చెప్పుకున్న ఓ ఖైదీ జైలు నుంచే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు బెదిరింపు కాల్స్ చేశాడు. రూ. 100 కోట్లు అరేంజ్ చేయాలని, లేదంటే ఆఫీసు పేల్చేస్తానని హిందీలో మాట్లాడుతూ కర్ణాటకలోని బెలగావి జైలులోని ఆ నిందితుడు మూడు సార్లు కాల్ చేశాడని నాగ్‌పూర్ సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. ఆ ఫోన్‌ను పీఆర్ ఆఫీసర్ లిఫ్ట్ చేశారు.

ఆ కాల్ చేసిన ఖైదీని జయేశ్ పుజారీగా గుర్తించారు. బెలగావి జైల్ బ్యారక్ నుంచి ఈ కాల్ చేసినట్టు పోలీసులు వివరించారు. 2016లో జైలు బ్రేక్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అతను గతంలో పలువురు ప్రముఖులు ఫోన్ చేసి బెదిరింపులు జరిపిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనను జైలులోనే విచారిస్తున్నామని, ఈ బెదిరింపు కాల్స్ చేయడం వెనుక కారణం ఏముందనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నదని వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios