Asianet News TeluguAsianet News Telugu

మా బాంబులు గురితప్పే ఛాన్సే లేదు... బాలాకోట్‌లో ఏం మిగల్లేదు

భారత యుద్ధ విమానాలు తమ భూభాగంపైకి ప్రవేశించినది నిజమే అయినప్పటి అందువల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న పాక్ వ్యాఖ్యలకు భారత రక్షణ రంగ నిపుణులు గట్టి సమాధానం ఇచ్చారు.

this way to targeted indian airforce on balakot
Author
New Delhi, First Published Mar 4, 2019, 10:43 AM IST

భారత యుద్ధ విమానాలు తమ భూభాగంపైకి ప్రవేశించినది నిజమే అయినప్పటి అందువల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న పాక్ వ్యాఖ్యలకు భారత రక్షణ రంగ నిపుణులు గట్టి సమాధానం ఇచ్చారు.

మిరాజ్-2000 యుద్ధ విమానాలు జారవిడిచిన ‘‘స్పైస్-2000’’ ప్రిసిషన్ గైడెడ్ మునిషనస్’’ బాంబుల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉంటుందని తెలిపారు. బాంబుల్లో ఉన్న చిప్పుల్లోకి జైషే స్థావరానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, భౌగోళిక అక్షాంశ, రేఖాంశాలతో కూడిన డేటాను ఎయిర్‌ఫోర్ చొప్పించినట్లు నిపుణులు వెల్లడించారు.

పాక్ భూభాగం మీదకు ప్రవేశించిన మీదట.. బాలాకోట్ చేరువకాగానే ఉగ్ర స్థావరంపైకి చేరుకున్నాయి. అటు పిమ్మట కంప్యూటర్ స్క్రీన్‌పై ‘‘ క్లియర్ టూ లాంచ్ వెపన్స్ ’’ సంకేతాలు వచ్చాయన్నారు.

ఆ తర్వాతే పైలట్లు ఉగ్రవాద స్థావరంపై బాంబులు వేశారని రక్షణ రంగానికి చెందిన నిపుణులు తెలిపారు. ఇంత పక్కాగా బాంబులు అమర్చి, లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాతే అవి గురి తప్పే అవకాశమే లేదని వారు వాదిస్తున్నారు.

ఈ బాంబులు ఉగ్రవాద స్థావరాల పైకప్పును చీల్చుకుంటూ లోపలికి వెళ్లి.. ఆ తర్వాత పేలాయన్నారు. పేలుడు అనంతరం అక్కడ చోటు చేసుకున్న ప్రకంపనతో అందులోని వారంతా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

దాయాది ఈ దాడిని కప్పిపుచ్చుతున్నప్పటికీ జైషే మొహ్మద్ చీఫ్ మసూద్ అజార్, సోదరుడు మౌలానా అమర్ మాత్రం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తమ స్థావరంపై బాంబుల వర్షం కురిపించిందని అంగీకరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios