Asianet News TeluguAsianet News Telugu

ఈ బంక్‌లో ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్.. ‘షరతులు వర్తిస్తాయి’

ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి తరుణంలో ఉచితంగా పెట్రోల్ అందిస్తామంటే ఎవరైనా ఎందుకు ఆలోచిస్తారు? తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఓ బంక్‌లో ఉచితంగా లీటర్ పెట్రోల్ అందిస్తున్నారు. దీనికి ఓ ప్రైవేటు కంపెనీ స్పాన్షర్షిప్ ఇస్తున్నది. అయితే, అందుకు ఓ కండీషన్ పెట్టింది.
 

this petrol pump in tamilnadu giving litre petrol for free
Author
Chennai, First Published Sep 11, 2021, 7:37 PM IST

చెన్నై: దేశవ్యాప్తంగా చమురు ధరలు కొంతకాలంగా ప్రధాన చర్చాంశాల్లోకి వచ్చాయి. సామాన్యుల నడ్డి విరిస్తూ ధరలు పెరగడంపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ పెట్రోల్ బంక్‌లో ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ అందజేసే కార్యక్రమం ఒకటి జరుగుతున్నది. ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలేదే లేదని స్థానికులు బంక్ ముందు బారులు తీరారు. అయితే, లీటర్ పెట్రోల్ ఉచితంగా పొందాలంటే ఒక కండీషన్ అని స్పాన్సర్లు చెప్పారు.

తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఉతిరామెరూర్ గ్రామంలో ఓ ప్రైవేటు కంపెనీ ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం చేపడుతున్నది. ఆధార్ కార్డు, పాన్ కార్డులు జిరాక్స్‌లు సమర్పించి ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ పొందండనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నది. దీంతో స్థానికులు పెద్దఎత్తున తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చి పెట్రోల్ పొందుతున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీరామ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్‌కు చెందినవారని చెప్పుకున్నారు.

అయితే, ఈ కార్యక్రమంపై వివాదమూ రేగుతున్నది. ఒక ప్రైవేటు కంపెనీ ప్రజల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డుల జిరాక్స్ తీసుకోవడం సబబేనా? అనే చర్చ జరుగుతున్నది. ఏ ప్రైవేటు కంపెనీకి అయినా, ప్రజల ఆధార్, పాన్ కార్డుల అవసరమేముంటుందని అడుగుతున్నారు. ఈ కోణంలో కార్యక్రమంపై అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధరపై మూడు రూపాయలు తగ్గిస్తున్నట్టు స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. గతనెల 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి పలనివేల్ త్యాగ రాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సవరణ చేసిన బడ్జెట్‌లో పన్నును తగ్గించి లీటర్ పెట్రోల్‌పై రూ. 3 తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రం రూ. 1,160 కోట్లు రాబడి నష్టపోనున్నట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios