ఈ క్రమంలో టమాటల ధరలపై ఇన్ స్టాగ్రామ్ లో ఖుషాల్ అనే వ్యక్తి ఓ పేరడీ సాంగ్ చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ టమాట ధర రూ.155 దాటిపోయింది. దీంతో, సామాన్యులు టమాటలు కొనడానికి కూడా భయపడిపోతున్నారు. దాదాపు చాలా మంది ప్రతి వంటలోనూ టమాటాలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి టమాట ధర అమాంతం పెరిగిపోవడంతో అందరూ షాకైపోతున్నారు. ఇలా అయితే, తాము కడుపు నిండా భోజనం చేయడం కూడా కష్టమే కదా అని వాపోతున్నారు. ఈ క్రమంలో టమాటల ధరలపై ఇన్ స్టాగ్రామ్ లో ఖుషాల్ అనే వ్యక్తి ఓ పేరడీ సాంగ్ చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
డబ్బులు ఇచ్చి టమాటాలు కొనుగోలు చేయడంతో వీడియో మొదలైంది. తర్వాత ఖుషాల్ , అతని స్నేహితులు కొందరు పురుషులు కలిసి పేరడీ సాంగ్ చేయడం విశేషం. విశాల్ హీరోగా వచ్చిన ఓ తమిళ సినిమాలోని టుమ్ టుమ్ పాటను వీరు టమాటతో పేరడీ చేయడం విశేషం. టమాట లేకుండా వంట పూర్తవ్వదు, అలాంటి టమాట ధర పెరిగిపోతే ఎలా అనే అర్థం వచ్చేలా ఈ పాటను తయారు చేయడం విశేషం.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు 453 వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం. కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజన్లకు ఈ పాట అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఖుషాల్ తన పేరడీ పాటలో మధ్యతరగతి స్థితిని ఎంత సముచితంగా వర్ణించాడాన్ని అందరూ అభినందిస్తున్నారు. మరికొందరు కంటెంట్ సృష్టికర్త ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చినందుకు ప్రశంసించారు.
మెట్రో నగరాల్లో, రిటైల్ టమోటా ధరలు కిలోకు రూ. 58-148 మధ్య ఉన్నాయి, కోల్‌కతాలో అత్యధికంగా రూ. 148, ముంబైలో అత్యల్పంగా కిలో రూ. 58. ఢిల్లీ, చెన్నైలో టమాటా కిలో రూ.110 కి పైగా ఉంది.
