Asianet News TeluguAsianet News Telugu

ఖరీదైన ఆడీ కారు.. చేసింది టీ వ్యాపారం.. ముంబై కుర్రాళ్ల న్యూ బిజినెస్

ఖరీదైన ఆడి కారులో వచ్చి.. రోడ్డు పక్కన టీ పాయింట్ ఏర్పాటు చేసుకుని..టీ  అమ్ముతున్నారు ముంబాయికి చెందిన యువకులు. వాళ్ల కథేంటో ఓ సారి తెలుసుకుందాం..

This Mumbai chaiwala has set up a tea stall in his Audi. Watch viral video KRJ
Author
First Published May 31, 2023, 5:50 AM IST

కొన్ని సార్లు పెద్ద పెద్ద కంపెనిలలో ఉద్యోగాలు చేసే వారికన్నా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. రిస్క్ ఉన్న మనకు మనమే బాస్.. ఒకరి వద్ద పనిచేయడం కంటే.. స్వంతంగా బిజినెస్ పెట్టుకుని..లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ..ముందుకు సాగాలని నేటీ యువత భావిస్తున్నారు. అవును మనం ఏ పని చేసినా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగిపోవాలి. అలాగే. మనం చేసే పని పట్ల గౌరవం, అంకిత భావం కూడా ఉండాలి. అప్పుడే.. మనం అనుకున్న స్థాయికి చేరుకుంటాం. అందుకు నిదర్శనంగా నిలిచారు ఈ ముంబై కుర్రాళ్లు.
వారు ట్రెండ్ ను గుడ్డిగా ఫాలో కాకుండా.. ట్రెండ్ ను సెట్ చేశారు. 

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో టీ అమ్మడం కూడా కెరీర్‌గా మారినట్లు చూస్తుంటాం.  అందులో ఎంబీఏ చాయ్‌వాలా, బీటెక్ చైవాలీ.. ఈ కోవకు చెందిన వారే ఆడి చాయ్‌వాలా. వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి కోటి రూపాయల విలువైన ఆడి కారులో టీ అమ్మేందుకు వస్తాడు. తానే స్వయంగా తన చేతులతో టీ తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నాడు. టీ తయారు చేస్తున్న వ్యక్తి వీడియోలు ఇప్పటివరకు వేల లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.  

 ముంబైకి చెందిన కాశ్యప్, మను శర్మ  చాయ్ బిజినెస్ ను వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే  ఖరీదైన ఆడి కారులో  ‘ఆన్ డ్రైవ్ టీ’ అనే పేరుతో ‘థింక్ లగ్జరీ.. డ్రింక్ లగ్జరీ’ అంటూ టీ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలోని లోఖండ్‌వాలా ఏరియాలో ఓ చెట్టు కింద టీ స్టాల్ ఓపెన్ చేశాడు. వీరికి బిజిసెన్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. వారు విలాసవంతమైన ఆడి కారులో విలాసవంతమైన ఇంటి నుండి బయలుదేరడం.

వారిని చూస్తే..  కార్యాలయానికి వెళ్తున్నట్లు కనిపించడం. కానీ దానికి విరుద్ధంగా..అతను ముంబైలోని లోఖండ్‌వాలా బ్యాక్‌రోడ్‌లో తన ఆడి కారును నిలిపి..ఇక్కడే ఓ టీ స్టాల్‌ను ఏర్పాటు చేయడం. కస్టమర్స్ కు తానే స్వయంగా టీ తయారు చేసి.. అందిస్తున్నాడు.ఛాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడి కారులో తిరిగి వెళ్లిపోతారు. ఇక్కడి వారికి డబ్బులు లేక కాదు.. ఓ వినూత్న ఆలోచనతో బిజిసెస్ ను ఎలా ప్రమోట్ చేసుకోవాలనేదే వాళ్ల లక్ష్యం. అందులో వారు సక్సెస్ అయ్యారు. 

వీరిని చూసిన చాలా మంది ఆశ్చర్యపోతుంటే.. మరికొందరూ స్ఫూర్తిగా తీసుకున్నారు. అసలు ఆడి కారేంటీ.. అందులో ఛాయ్ అమ్మడం ఏంటా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలని మరికొందరూ కామెంట్ చేయడం చూడవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios