CM Mohan Yadav: తన స్థానాన్ని భర్తీ చేస్తున్న కొత్త సీఎం మోహన్ యాదవ్ ఎంపికపై శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందన ఏమిటీ
మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా బీజేపీ మోహన్ యాదవ్‌ను ఎంచుకుంది. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్‌కు ఈ సారి మొండిచేయి చూపించింది. అయితే.. కొత్త సీఎం మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకోవడంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలా స్పందించారు?
Mohan Yadav: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగు సార్లు బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ కేంద్ర పరిశీలకులను పంపి సీఎం అభ్యర్థిని మార్చేసింది. సీఎం పదవి కోసం బీజేపీ అనూహ్యంగా కొత్తపేరును ప్రకటించింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయం బీజేపీ శ్రేణుల కూడా ఆశ్చర్యపరిచింది. అయితే.. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి.. ఇప్పుడూ సీఎం సీటు కోసం పోటీ పడ్డ శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నిర్ణయంపై ఎలా స్పందించారు.
తన స్థానాన్ని భర్తీ చేయబోతున్న కొత్త సీఎం మోహన్ యాదవ్ పై తాజా మాజీ సీఎం శివరాజ్ సింగ్ స్పందించారు. మోహన్ యాదవ్‌ను శ్రమించే మిత్రుడిగా పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ రంగంలో కొత్త శిఖరాలు అధిరోహించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకంలో కొత్త రికార్డులు సృష్టిస్తారని విశ్వాసం వ్యక్తపరిచారు. ఈ బాధ్యత తీసుకుంటున్న మోహన్ యాదవ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు.
Also Read: Madhya Pradesh CM: ఎవరీ మోహన్ యాదవ్? మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లింక్ ఏమిటీ?
సీఎంగా ఎన్నికైన తర్వాత మోహన్ యాదవ్ ఇలా స్పందించారు. ‘నేను పార్టీకి చిన్న కార్యకర్తను. రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వాన్ని నా ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణతో నా బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తాను’ అని మోహన్ యాదవ్ వివరించారు.