నేడు వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. దాదాపు లవర్స్ అంతా ఈ రోజున తమ లవర్ తో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అలానే చేస్తుంటారు కూడా. ఒకవైపు ప్రేమికులు ప్రేమలో మునిగితేలుతుంటే.. లవ్ ఫెయిల్యూర్స్ మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటారు. అందుకే అలాంటి వారి కోసం ఒక కేఫ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

లవ్ ఫెయిల్సూర్స్ కోసం బెంగళూరులోని ఓ కేఫ్  ఓ ఆఫర్ ప్రకటించింది. తమ మాజీ లవర్ ఫోటోని తగలపెడితే.. వారికి ఉచితంగా డెజర్ట్( కేక్, ఐస్ క్రీమ్ లాంటివి) ఇస్తామంటూ ప్రకటించింది.

బెంగళూరు నగరంలోని కోరమంగల రౌండప్ కేఫ్ ఈ వింత ప్రకటన చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఈమేరకు కేఫ్ యాజమాన్యం ఈ ప్రకటన విడుదల చేయగా.. అది కాస్త పాపులర్ అయ్యింది. ఈ కేఫ్ చాలా మంది భగ్న ప్రేమికులు క్యూలు కట్టిమరీ వెళ్తున్నట్లు సమాచారం.