కరోనా పరీక్ష నిర్థారణ.. అతి తక్కువ ఖర్చుతో...

కాగా.. ఈ వైరస్ పరీక్ష నిర్థారణ అతి తక్కువ ఖర్చుతో ముగిసేలా భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తక్కువ ఖర్చులో ఓ కిట్ ని తయారు చేశారు. దీనికి ‘ ఫెలూడా’గా నామకరణం చేశారు. 

This 'Feluda' Paper-Strip Test Developed by CSIR Scientists Checks for Coronavirus in Minutes

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గతేడాది చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దాదాపు 200 దేశాలకు ఈ వైరస్ పాకింది. కాగా.. ఊహించని విధంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాల ప్రభుత్వాలు వైరస్ లక్షణాలు కనిపించిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా.. ఈ వైరస్ పరీక్ష నిర్థారణ అతి తక్కువ ఖర్చుతో ముగిసేలా భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తక్కువ ఖర్చులో ఓ కిట్ ని తయారు చేశారు. దీనికి ‘ ఫెలూడా’గా నామకరణం చేశారు. 

సాధారణంగా రియల్ టైం రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్- పాలీమెరేజ్ చైన్ రియాక్షన్  పరీక్షల్లో ఆర్ఎన్ఏను డీఎన్ఏగా మారుస్తారు. సీఎన్ఐఆర్ శాస్త్రవేత్తలు చేసిన ఫెలూడా పరీక్ష కూడా ఈ ప్రక్రియ ద్వారానే ప్రారంభమౌతుంది.

అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన పీసీఆర్ రియాక్షన్ ద్వారా వైరల్ న్యూక్లిక్ ఆమ్లం సీక్వెన్స్ వృద్ధి చెందుతుంది. ఆపై ఎఫ్ఎన్ సీఏఎస్9 అనే ప్రోటీను సదరు సీక్వెన్స్ కు అతుక్కుంటుంది. గర్భనిర్ధారణ పరీక్ష తరహాలో పేరప్ స్టిక్ పై ఈ బంధాన్ని గుర్తించవచ్చు. కేవలం గంట వ్యవధిలో పరీక్ష పూర్తవుతుంది ఖరీదైన రియల్ టైం పీసీఆర్ యంత్రాలను ఈ పరీక్షలో ఉపయోగించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios