ముంబై: రెంట్  ఏ బోయ్ ఫ్రెండ్  పేరుతో ముంబైకి చెందిన  కౌశిక్ ప్రకాష్  ఓ యాప్‌ను రూపొందించాడు. కేవలం నాలుగు గంటల పాటు   ఓ మహిళకు బోయ్ ఫ్రెండ్‌గా ఉండేందుకు  ఈ యాప్ ద్వారా నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు.

రెంట్ ఏ బోయ్ ఫ్రెండ్‌లో సభ్యులుగా చేరాలంటే ఆషామాషీ వ్యవహరం కాదు. అబ్బాయిల మాట తీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్, శారీరక, మానసిక స్థితిగతులను పూర్తిగా పరీక్షించిన తర్వాతే  సభ్యులుగా తీసుకొంటారు.

అద్దెకు వెళ్లిన అబ్బాయిలు  నాలుగు గంటల పాటు తమను అద్దెకు తీసుకొన్న మహిళలను సంతోషపెట్టాల్సి ఉంటుంది. కానీ, వారితో అసభ్యంగా ప్రవర్తించకూడదు. తీవ్రంగా ఒత్తిడికి గురై  ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని సంతోషపర్చేందుకు  ఈ యాప్‌ను రూపొందించినట్టు కౌశిక్ ప్రకాష్ చెప్పారు.

శృంగారం కోసం ఈ యాప్  తయారు చేయలేదు.  తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారు  ఈ యాప్ ద్వారా తమకు నచ్చిన బోయ్ ఫ్రెండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.  ఈ నాలుగు గంటల పాటు  డిప్రెషన్‌లో ఉన్న వారిని  బోయ్‌ఫ్రెండ్స్ సంతోషంగా ఉండేలా చూస్తారు.

గంట చొప్పున బోయ్‌ఫ్రెండ్ కు అద్దెను చెల్లించాల్సి ఉంటుంది.  నాలుగు గంటల కంటే ఎక్కువగా బోయ్ ఫ్రెండ్‌తో గడపాలంటే ముందే  ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అద్దెకు తెచ్చుకొన్న మహిళను సంతోషంగా ఉండేలా బోయ్ ఫ్రెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఒంటరి మహిళలకు  ఈ యాప్  ప్రయోజనకరంగా ఉంటుందని యాప్  తయారీదారుడు  కౌశిక ప్రకాష్ చెప్పారు.