సారాంశం
క్రికెట్ ఆడుతుండగా జరిగిన గొడవలో 13యేళ్ల బాలుడు.. 12యేళ్ల బాలుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు రెండు రోజుల అనంతరం మృతి చెందాడు.
మహారాష్ట్ర : మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో క్రికెట్ ఆడే విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల మరో మైనర్ బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడు బాధితుడి తలపై బ్యాట్‌తో కొట్టడంతో జూన్ 3న ఈ ఘటన జరిగింది. బాలుడు చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందాడని వారు తెలిపారు.
బాధితుడి కుటుంబం ఈ విషయం మీద పోలీసు ఫిర్యాదు నమోదు చేయకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టిందని నగర పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. అతని తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించగా, కేసు దర్యాప్తు కోసం బుధవారం మృతదేహాన్ని వెలికితీసినట్లు అతను చెప్పాడు.
సంవత్సరానికి రూ.40లక్షల జీతం సరిపోతుందా? ట్విట్టర్ రియాక్షన్ ఇదే..!
జూన్ 3న ఇక్కడి బగద్కిడ్కి ప్రాంతానికి చెందిన కొందరు కుర్రాళ్లు ఓ మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఆట ఆడుతున్న సమయంలో బాధితుడు ఇతర అబ్బాయిలతో వాగ్వాదానికి దిగాడని, నిందితులు అతనిని బ్యాట్‌తో కొట్టారని అధికారి తెలిపారు.
బాధితుడు నేలపై పడిపోయాడు. వెంటనే జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందినట్లు తెలిపారు. అతని బంధువులు పోలీసు కంప్లైంట్ నమోదు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అతని తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు.
అనంతరం కేసు విచారణ నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారని తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, బాలుడిని ఇంకా పట్టుకోలేదని అధికారి తెలిపారు.