దొంగలు కావలెను.. జీతం నెలకు 15 వేలు

First Published 11, Oct 2018, 12:20 PM IST
thieves recruitment in rajasthan
Highlights

పలు సంస్థలు సిబ్బందిని నియమించుకుని వారికి నెల నెల జీతాలను చెల్లిస్తుంటాయి. కార్పోరేట్ ప్రపంచంలో అదంతా రోజువారీగా జరిగేదే. అయితే ఏకంగా దొంగతనం చేయడానికి దొంగలను నియమించుకుని వారికి నెల నెలా జీతాలు కూడా చెల్లిస్తున్నాడు ఓ వ్యక్తి

పలు సంస్థలు సిబ్బందిని నియమించుకుని వారికి నెల నెల జీతాలను చెల్లిస్తుంటాయి. కార్పోరేట్ ప్రపంచంలో అదంతా రోజువారీగా జరిగేదే. అయితే ఏకంగా దొంగతనం చేయడానికి దొంగలను నియమించుకుని వారికి నెల నెలా జీతాలు కూడా చెల్లిస్తున్నాడు ఓ వ్యక్తి..

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల ఆశిష్ మీనా అనే వ్యక్తి నిరుద్యోగులైన పేద యువకులను టార్గెట్ చేసుకుని వారిని దొంగలుగా నియమించుకున్నాడు. తన దగ్గర పనిచేసినందుకు గాను నెలకు రూ.15 వేలు వేతనంగా చెల్లిస్తున్నాడు.

ప్రతి రోజు మోటార్ సైకిళ్లు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు దొంగిలించడం వీరి బాధ్యత. కనీసం రోజుకు ఒక్క దొంగతనమైనా చేయాలి.. లేదంటే ఆ రోజే శాలరీ కట్.. ఇవి ఆశిష్ తను రిక్రూట్ చేసుకున్న వారికి విధించిన నిబంధనలు. రాష్ట్రంలో వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడంతో పాటు వీరు దొంగిలించిన సెల్‌ఫోన్లను ట్రేస్ చేసి వారి కదలికలను గుర్తించారు.

చివరికి మంగళవారం జైపూర్‌‌లోని ప్రతాప్ నగర్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించి దాడి చేశారు.  ప్రాంతాల్లో మాటు వేసి ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 33 సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, బంగారు గొలుసులు, నాలుగు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను విచారించగా.. ఆశిష్ మీనా తమను దొంగలుగా నియమించుకుని జీతాలు చెల్లిస్తున్నాడని.. దొంగతనం చేసి తీసుకువచ్చే వస్తువులను అమ్ముకుని అతను డబ్బు సంపాదిస్తున్నాడని చెప్పారు.  

loader