Asianet News TeluguAsianet News Telugu

60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు: ఇంతకీ వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సాధారణంగా దొంగలు ఇళ్లలో, బ్యాంకుల్లో, గుళ్లలో, బ్యాంకుల్లో.. దూరి గొంగతనాలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని దొంగతనాల గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. తాజాగా బిహార్‌ రోహతాస్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ చోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

Thieves posing as govt officials steal 60-foot iron bridge in Bihar
Author
Hyderabad, First Published Apr 9, 2022, 4:14 PM IST

సాధారణంగా దొంగలు ఇళ్లలో, బ్యాంకుల్లో, గుళ్లలో, బ్యాంకుల్లో.. దూరి గొంగతనాలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని దొంగతనాల గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఘటనే తాజాగా బిహార్‌లో చోటచేసుకుంది. బిహార్‌ రోహతాస్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ చోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ బిహార్‌లో మాత్రం 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని మాయం చేశారు. 500 అడుగుల ఇనుమును దోచుకెళ్లారు. ఇదేలా సాధ్యమైందని అనుకుంటున్నారా..?. ఇందుకోసం దొంగలు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులమని జనాలను, స్థానిక అధికారులను నమ్మించారు.

జిల్లాలోని నాసరీగంజ్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని అమియావార్​లో అర కెనాల్‌పై ఓ పురాతన ఐరన్​ బ్రిడ్జి ఉంది. దీని పొడవు 60 అడుగులకు పైగా ఉంది. ప్రస్తుతం ఆ బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కా ప్లాన్ వేశారు. నీటి పారుదల శాఖ అధికారుల వలె నటించిన దొంగలు.. బుల్‌డోజర్లు, గ్యాస్ కట్టర్‌ల సాయంతో బ్రిడ్జి మొత్తాన్ని కూల్చివేశారు. అనంతరం ఇనుమును మొత్తం వాహనాల్లో ఎక్కించి తరలించుకుపోయారు. మూడు రోజుల్లోనే తమ పని కానిచ్చేశారు. ఇలా అసాధారణ రీతిలో దోపిడికి పాల్పడ్డారు. 

అయితే తర్వాత వచ్చింది ఇరిగేషన్ అధికారులు కాదని.. దొంగలు అని తెలిసింది. దీంతో గ్రామస్థులతో సహా, స్థానిక ప్రభుత్వ అధికారులు కూడా షాక్ అయ్యారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నీటిపారుదల శాఖ అధికారుల నుంచి మాకు ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. నిందితులను గుర్తించేందుకు స్కెచ్‌లు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. స్క్రాప్‌ డీలర్‌లను కూడా అప్రమత్తం చేశాం’ అని ఎస్‌హెచ్‌వో సుభాష్ కుమార్ తెలిపారు. ఇక, ఈ చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామని నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజినీర్ అర్షద్ కమల్ షమ్సీ తెలిపారు.

ఇక, అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై ఈ వంతెన నిర్మించబడింది. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున దీన్ని నిర్మించారు. అయితే అది ఇప్పుడు పాతబడిపోయింది. అది ప్రయాణానికి ప్రమాదకరంగా మారడంతో.. ప్రజలు ఆ బ్రిడ్జిని వినియోగించడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios