Asianet News TeluguAsianet News Telugu

Viral: గుడిలో చోరీ చేయడానికి వచ్చి... అమ్మవారిని నమస్కరించి...!

చొక్కాలేకుండా.. ముఖానికి మాస్క్ ధరించి గుడిలోకి ప్రవేశించిన దొంగ ముందుగా గర్భ గుడిలోకి ప్రవేశించాడు.  ఆ తర్వాత వెంటనే దొంగతనం చేయకుండా.. అమ్మవారికి నమస్కారం చేయడం గమనార్హం.

Thief Bows To Temple Idol Before Stealing Donation Boxes
Author
hyderabad, First Published Aug 10, 2022, 10:55 AM IST

ఓ వ్యక్తి గుడిలో దొంగతనానికి వచ్చాడు. దొంగతనానికి వచ్చి.. గుడిలో హుండీలు ఎత్తుకుపోయాడు. కానీ.. దానికి ముందు మాత్రం.. గుడిలో అమ్మవారికి నమస్కారం చేసుకోవడం గమనార్హం.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గుడిలో ఉన్న సీసీ కెమేరాలో ఇదంతా క్యాప్చర్ కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లోని ఓ అమ్మవారి ఆలయంలో ఇటీవల దొంగతనం జరిగింది. ఆ దొంగతనం మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమేరాలో రికార్డు కాగా... వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చొక్కాలేకుండా.. ముఖానికి మాస్క్ ధరించి గుడిలోకి ప్రవేశించిన దొంగ ముందుగా గర్భ గుడిలోకి ప్రవేశించాడు.  ఆ తర్వాత వెంటనే దొంగతనం చేయకుండా.. అమ్మవారికి నమస్కారం చేయడం గమనార్హం. అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత.. అతను హుండీని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం గమనార్హం.


ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. దొంగ చేసిన పని చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 
వైరల్ వీడియోలో, దొంగ తన ముఖాన్ని కప్పుకుని, తెర ఎత్తి ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించినట్లు కనిపించాడు. తర్వాత  దేవత భారీ విగ్రహాన్ని చూసిన తర్వాత అతను ఆశ్చర్యపోయాడు. తన్మయంతో అమ్మవారికి నమస్కరించాడు. ఆ తర్వాత.. వెంటనే తన వృత్తి ధర్మం చేయడం మొదలుపెట్టాడు. దొంగ దేవత విగ్రహం ముందు ఉన్న హుండీ, విలువైన వస్తువులను దొంగలించేశాడు.


ఆగస్టు 5న ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ వీడియోని నెటింట షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దొంగ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు అమ్మవారికి సమర్పించిన రెండు పెద్ద గుడి గంటలు, ప్రసాదాలను కూడా దొంగ దొంగిలించాడు.


"ఒక భక్తుడు భగవంతుని నివాసం నుండి దొంగిలించినట్లయితే, అది దొంగతనం కాదు. కష్ట సమయాల్లో భక్తుడు భగవంతుని సహాయం కోరుకుంటున్నాడు" అని ఒక వినియోగదారు ట్వీట్ చేశారు.

"దొంగ ఒకే దెబ్బకు రెండు పిట్టలను చంపాడు - తన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకున్నాడు. అతని వ్యాపారాన్ని కూడా నిర్వహించాడు" అని మరొకరు ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios