తమ నిరసనను నిలిపేయాలని ఒత్తిడి తెస్తున్నారని బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు తెలిపారు. ఈ ఒత్తిళ్లతో మైనర్ రెజ్లర్ తండ్రి యూటర్న్ తీసుకున్నాడని వివరించారు. అంతేకాదు, నిన్న డబ్ల్యూఎఫ్ఐ ఆఫీసుకు తీసుకెళ్లిన రెజ్లర్‌కు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మైనర్ బాలిక యూటర్న్ కేవలం ఒత్తిళ్ల వల్లేనని వివరించారు. 

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చేసిన ఆరోపణలకు సంబంధించి ‘మైనర్’ రెజ్లర్ తన స్టేట్‌మెంట్ మార్చడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై నిరసనలు చేస్తున్న రెజ్లర్లు స్పందించారు. వారు ఒత్తిడికి గురై స్టేట్‌మెంట్ మార్చారని తెలిపారు. తమపైనా తీవ్ర ఒత్తిడి ఉన్నదని చెప్పారు. తమ నిరసనలను నిలిపేయాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. బ్రిజ్ భూషణ్ మనుషులు తమకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తెలిపారు.

మైనర్ బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిడి పెంచారని, ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లాడని బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు ఎన్డీటీవీకి తెలిపారు. అందుకే అతను తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారని వివరించారు. అందుకే తమ నిరసనలు ప్రారంభించిన మొదటి రోజు నుంచీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్ చేశామని చెప్పారు. ఆయన బయట ఉంటే దర్యాప్తు మొత్తాన్ని ప్రభావితం చేస్తారని తెలిపారు. దర్యాప్తును పక్కదారి పట్టించే, బాధితులను, సాక్షులను బెదిరించి ఒత్తిడి తెచ్చేంత పలుకుబడి ఉన్నారని వివరించారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టు కాకుండా పారదర్శకమైన, నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదని సాక్షి మాలిక్ చెప్పారు.

Also Read: లేడీస్ లోదుస్తులు వేసుకుని బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య!.. ఉరి తాడుకు ఆ దుస్తుల్లో వేలాడుతూ..!

బజరంగ పూనియా ఈ రోజు నిర్వహించిన మహా పంచాయత్ గురించి మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ డెడ్ లైన్ ముగిసినా కేంద్రం చర్యలు తీసుకోకుంటే ఆ తర్వాత చేపట్టాల్సిన కార్యచరణ గురించి చర్చ జరిగిందని బజరంగ పూనియా తెలిపారు. దర్యాప్తునకు 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. రెజ్లర్లు ఈ డెడ్ లైన్ అంగీకరించారు. బలమైన చార్జిషీటు ఉంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయవచ్చని తెలిపారు. 

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టు డిమాండ్ నుంచి తాము వెనక్కి తగ్గలేదని వివరించారు.

దర్యాప్తులో భాగంగా ఓ మహిళా రెజ్లర్‌ను పోలీసులు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఆఫీసుకు తీసుకెళ్లారని వివరించారు. లోపల బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లేరని పోలీసులు అబద్ధం చెప్పి ఆమెను లోనికి తీసుకెళ్లారు. కానీ, లోపల బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉన్నట్టు ఆమెకు తెలిసిందని పేర్కొన్నారు.

‘పోలీసుల నిన్న ఓ మహిళా రెజ్లర్‌ను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉన్నప్పటికీ ఆమెను తీసుకెళ్లారు. అయినా నిర్దారించుకోవడానికి ఆ మహిళా రెజ్లర్‌ పోలీసులును అడిగింది. లోపల బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కనిపించాడు. పోలీసులు ఆమెకు అబద్ధం చెప్పారు. అతనిని చూడగానే ఆమె భయపడిపోయింది. మొత్తం వ్యవస్థనే ఆయనను కాపాడుతున్నది’ అని బజరంగ్ పూనియా తెలిపారు.