అజిత్ పవార్ కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు ఎంతమందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అజిత్ పవార్ ఉదయం తనకు 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని అన్నాడు. ఆ తరువాత మధ్యాహ్నానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రెస్ మీట్ పెట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతోని పెరేడ్ నిర్వహించాడు. 

శరద్ పవార్ చెప్పిన లెక్కల ప్రకారం ఒక 8 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట వెళ్లినట్టు చెప్పారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో వారందరిని ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. ఈ 9 మంది రెబెల్స్ ఎవరెవరంటే...దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్, సునీల్ భుసారా , దిలీప్ బంకర్, అనిల్ భాయ్ దాస్ పాటిల్, నితిన్ పవార్, సునీల్ శెలకే, బాబా సాహెబ్ పాటిల్, సంజయ్ బన్సన్. 

వారందరిని ఒక ప్రత్యేక ప్రైవేట్ విమానంలో ఢిల్లీ కి మరికాసేపట్లో తరలించనున్నారు. వారికి సంబంధించిన ఫ్లైట్ ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉంది. 

దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్, సునీల్ భుసారా , దిలీప్ బంకర్, అనిల్ భాయ్ దాస్ పాటిల్, నితిన్ పవార్, సునీల్ శెలకే, బాబా సాహెబ్ పాటిల్, సంజయ్ బన్సన్,