Asianet News TeluguAsianet News Telugu

ఇవే నా చివ‌రి ఎన్నిక‌లు.. : కర్ణాటక ఎన్నికల ప్ర‌చారంలో సిద్ధరామయ్య ఎమోషనల్ కామెంట్స్

Karnataka assembly election: ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌లు అంటూ కర్ణాటక ఎన్నికల ప్ర‌చారంలో సిద్ధరామయ్య ఎమోషనల్ అవుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. మైసూరులోని వరుణలో జరిగిన ర్యాలీలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.
 

These are my last elections: Congress leader Siddaramaiah's emotional comments during Karnataka election campaign RMA
Author
First Published Apr 19, 2023, 4:32 PM IST

Congress leader Siddaramaiah's emotional comments: క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌లు అంటూ కర్ణాటక ఎన్నికల ప్ర‌చారంలో సిద్ధరామయ్య ఎమోషనల్ అవుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలావుంటే, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎన్నికల తర్వాత ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. మైసూరులోని వరుణలో జరిగిన ర్యాలీలో సిద్ధరామయ్య ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

 

 

వరుణ అసెంబ్లీ స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ

కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ స్థానం నుంచి సిద్ధరామయ్యను కాంగ్రెస్ బరిలోకి దింపింది. వరుణ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయ‌న ఇప్ప‌టికే నామినేషన్ దాఖలు చేశారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

 

 

సీఎం పేరును పార్టీ నిర్ణయిస్తుంది.. 

కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య అన్నారు. తాము కులం ఆధారంగా ఓట్లు అడగడం లేదన్నారు. లింగాయత్ సామాజికవర్గంతో సహా అన్ని వర్గాల ఓట్లను ఆశిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో పార్టీ నిర్ణయిస్తుందని ఆయ‌న పేర్కొన్నారు.

 

216 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటి వరకు 216 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మిగిలిన స్థానాల పేర్లను కూడా త్వరలోనే ప్రకటిస్తారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios