రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ బలహీనపడుతోందని, టీవీ ఛానళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, నిజాలు మాట్లాడేవారిని జైళ్లలో పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రక్రియ కాకపోతే ఏమిటని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తేల్చి చెప్పారు. విదేశాల్లో తన వ్యాఖ్యలతో దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని, ఇప్పుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న వారు ఆ విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సుప్రీంలో చుక్కెదురు: స్టేకి నిరాకరణ
యూకేలో ‘ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది’ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ కొన్ని రోజులుగా బీజేపీతో పాటు సీనియర్ మంత్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్గే ఈ విధంగా స్పందించారు. ‘‘ మోడీ ఐదారు దేశాలకు వెళ్లి మన దేశ ప్రజలను అవమానించారు. భారతదేశంలో పుట్టడం పాపం అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న వారిని నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను’’ అని ఖర్గే అన్నారు.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసు.. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెయిల్..
ఇక్కడ ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛ బలహీనపడుతోందని, టీవీ ఛానళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, నిజాలు మాట్లాడేవారిని జైళ్లలో పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రక్రియ కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. కాబట్టి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇటీవల బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి, బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగం మొదటి రెండు రోజుల్లో ఉభయ సభలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్రిటిష్ పార్లమెంటేరియన్లతో మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, దేశ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయని బ్రిటన్ లో రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యుడు ముఖ్యమైన అంశాలను లేవనెత్తినప్పుడు మైక్ లు తరచుగా ఆఫ్ అవుతున్నాయని తెలిపారు.
ఎయిమ్స్ వైద్యుల అరుదైన విజయం.. గర్భస్థ శిశువుకు హార్ట్ సర్జరీ..
దీంతో విదేశీ గడ్డపై భారత్ ను కించపరుస్తున్నారని, మన దేశ వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్ కూడా గట్టిగానే సమాధానం చెబుతోంది. ప్రధాని మోడీ విదేశాల్లో అంతర్గత రాజకీయాలను లేవనెత్తిన సందర్భాలను గుర్తు చేస్తూ అధికార పార్టీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది.
