Uddhav Thackeray: ఎమర్జెన్సీ సమయంలో శివసేనపై కాంగ్రెస్ నిషేధం విధించలేదనీ పేర్కొన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే.. నేడు బీజేపీ, రెబల్స్ శివసేన లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Maharashtra: ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కూడా శివసేనపై నిషేధం విధించలేదు, కానీ బీజేపీ, శివసేన రెబల్ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూపు ఇప్పుడు శివసేన పార్టీ పూర్తిగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. తన 25 నిమిషాల సుదీర్ఘ ఆన్‌లైన్ ప్రసంగంలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, శివసేన, రెబల్ నాయకుల పోరు నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. శివసేన పార్టీ పేరు, గుర్తును ఎవరికీ ఇవ్వకుండా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం పార్టీ గుర్తు, పేరును స్తంభింపజేయడంతో శివసేన రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది.
ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన శివసైనికులకు విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలో బీజేపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై విమర్శలు గుప్పించారు. ఏక్ నాథ్ షిండే వర్గాన్ని "మిందే-గ్రూప్" అని ప్రస్తావిస్తూ, శివసేనను చీల్చడానికి బీజేపీ, మింధే-గ్రూప్‌ను ఉపయోగించుకుందని అన్నారు. "భారతీయ జనతా పార్టీ తన ప్రయోజనం కోసం ఏక్ నాథ్ షిండేను ఉపయోగించుకుంది. అయితే, ఎన్నికల సంఘం ఇప్పుడు పార్టీ పేరు, చిహ్నాన్ని స్తంభింపజేసింది. తమ ప్రయోజనం ముగిసిందనీ, బీజేపీ వారిని డంప్ చేస్తుందని మిందే గ్రూపు త్వరగా గ్రహించాలి" అని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
"పార్టీ పేరు (శివసేన), చిహ్నం (విల్లు-బాణం) స్తంభింపజేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం అన్యాయమైనది. అయినప్పటికీ, నేను విచ్ఛిన్నం కాలేదు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొని పార్టీని పునరుద్ధరించడానికి దానిని ఉపయోగించగల ఆత్మవిశ్వాసం నాకు ఉంది" అని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
ఎన్నికల గుర్తు, పార్టీ పేరు ఎంపికలు ఇవే..
ఇదిలావుండగా, శివసేనకు చెందిన ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని వర్గం తన ఎన్నికల గుర్తు కోసం త్రిశూలం, ఉదయించే సూర్యుడు, మషాల్ అనే మూడు ఎంపికలను ఆదివారం ఎన్నికల సంఘానికి సమర్పించింది. నవంబర్ 3న జరగనున్న అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి థాక్రే , ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు పార్టీ పేరును, ఎన్నికల గుర్తు 'విల్లు & బాణం'ని ఉపయోగించకుండా ఈసీ శనివారం నిషేధించింది. ఈ క్రమంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే ప్రత్యర్థి గ్రూపులను శివసేన పేరు లేదా 'విల్లు- బాణం' ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఎన్నికల సంఘం (EC) తాత్కాలికంగా నిషేధించిన ఒక రోజు తర్వాత, ఉద్ధవ్ నేతృత్వంలోని వర్గం ఆదివారం వారు మూడు పార్టీల గుర్తులను పంపినట్లు చెప్పారు. అందులో 'త్రిశూల్, మషాల్, రైజింగ్ సన్' లు ఉన్నాయి.
పార్టీ పేరును ప్రస్తావిస్తూ.. "మా పార్టీ పేరు శివసేన, శివసేన (బాలాసాహెబ్ థాక్రే)', 'శివసేన (ప్రబోధంకర్ థాక్రే)' లేదా 'శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' సహా శివసేనకు సంబంధించిన ఏవైనా పేర్లను ఎన్నికల కమిషన్ ఇస్తే మాకు ఆమోదయోగ్యంగా ఉంటుంది అని సావంత్ జోడించారు. 'శివసేన (బాలాసాహెబ్ థాక్రే)' పేరుకు మొదటి ఎంపిక అని వర్గాలు తెలిపాయి.
