గతేడాదితో పోలిస్తే పెరిగిన రూ. 500 డినామినేషన్ నకిలీ నోట్లు.. ఆర్‌బీఐ రిపోర్టులో కీలక విషయాలు..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)  తన వార్షిక నివేదికలో దేశంలో నకిలీ నోట్లకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. రూ.2000 నోట్ల‌తో పోలిస్తే రూ. 500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువగా సర్క్యూలేషన్‌ ఉన్నట్టుగా పేర్కొంది. 

There are more rs 500 fake notes in circulation than rs 2000 RBI report ksm

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)  తన వార్షిక నివేదికలో దేశంలో నకిలీ నోట్లకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. రూ.2000 నోట్ల‌తో పోలిస్తే రూ. 500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువగా సర్క్యూలేషన్‌ ఉన్నట్టుగా పేర్కొంది. మునపటి సంవత్సరంతో పోలిస్తే 2022-23లో రూ. 500 విడినామినేష‌న్‌కు చెందిన నకిలీ నోట్ల సంఖ్య 14.4 శాతం పెరిగిందని తెలిపింది. అటువంటి 91,110 నోట్లను గుర్తించినట్టుగా తెలిపింది. అదే సమయంలో గుర్తించిన రూ. 2,000 డినామినేషన్ నకిలీ నోట్ల సంఖ్య 9,806కు తగ్గిందని నివేదిక పేర్కొంది.

ఇక,2023 మార్చి 31 నాటికి విలువ పరంగా రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా..  చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.9 శాతంగా ఉంది. ఇది ఏడాది క్రితం 87.1 శాతంగా ఉంది. ‘‘గత సంవత్సరంతో పోలిస్తే రూ. 20, రూ.  500 (కొత్త డిజైన్) డినామినేషన్లలో కనుగొనబడిన నకిలీ నోట్లలో వరుసగా 8.4 శాతం,  14.4 శాతం పెరుగుదల ఉంది. అదే సమయంలో రూ.10, రూ.100, రూ.2000 డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు 11.6 శాతం తగ్గాయి’’ అని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.

బ్యాంకింగ్ రంగంలో గుర్తించిన మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల (ఎఫ్‌ఐసీఎన్‌లు) గత ఆర్థిక సంవత్సరంలో 2,30,971 నోట్లు కాగా.. 2022-23లో అది 2,25,769 నోట్లకు తగ్గింది. ‘‘2022-23 మధ్యకాలంలో బ్యాంకింగ్ రంగంలో కనుగొనబడిన మొత్తం నకిలీ నోట్లలో.. 4.6 శాతం రిజర్వ్ బ్యాంక్ వద్ద, 95.4 శాతం ఇతర బ్యాంకుల వద్ద కనుగొనబడ్డాయి’’ అని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. 

ఇక, ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. 2022-23లో సెక్యూరిటీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం ఖర్చు ₹4,682.80 కోట్లుగా ఉంది. అయితే ఈ మొత్తం గత సంవత్సరంలో రూ. 4,984.80 కోట్లుగా ఉంది.

ఇదిలా ఉంటే, మే 19 నాటి సర్క్యులర్‌లో రూ. 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రూ. 2,000 నోట్లను కలిగి ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios