సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  దోపిడికి పాల్పడ్డారు. 

సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దోపిడికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మందమర్రి-రవీంద్రఖని మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.దోపిడీ దొంగలను ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు దొరకలేదు. రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.