Asianet News TeluguAsianet News Telugu

Uttarkashi tunnel collapse : ఇంకా సొరంగంలోనే రాని కార్మికులు.. ఘటనా స్థలానికి చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు

uttarakhand tunnel collapse : ఉత్తరాఖండ్ లో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ సోమవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఘటనా స్థలానికి సోమవారం అంతర్జాతీయ సొరంగ నిపుణులు చేరుకున్నారు.

The workers who have not yet arrived in the tunnel. International experts have reached the scene..ISR
Author
First Published Nov 20, 2023, 12:01 PM IST

Uttarkashi tunnel collapse :ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కుప్పకూలి ఇప్పటికే 8 రోజులు దాటింది. అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులు అప్పటి నుంచి అందులోనే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే వారిని కాపాడేందుకు అధికారులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే సమయంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఘటన జరిగిన నాటి నుంచి సహాయక చర్యలు చేపడుతున్నారు. 

israel hamas war : హాస్పిటల్ కింద టెర్రరిస్ట్ టన్నెల్ ను గుర్తించిన ఇజ్రాయెల్ దళాలు.. లోపల ఎలా ఉందంటే (వీడియో)

కాగా.. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ సొరంగ నిపుణుల బృందం సోమవారం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరుకోవడంతో ఇంటర్నేషనల్ టన్నెల్లింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సంఘటనా స్థలంలో నిపుణులతో కలిసి ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. 

విషాదం.. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?

ఇదిలా ఉండగా.. ఈ రెస్క్యూ పనులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సాయం అందిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోపడే భారీ పరకరాలను ఘటనా స్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ తన భుజాలపైన వేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి దాదాపు 22 టన్నుల కీలకమైన పరికరాలను ఉత్తరాఖండ్ కు తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ -17 రవాణా విమానం సహాయపడింది. అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించడానికి భారత ఆర్మీకి చెందని ఓ డ్రోన్ వచ్చింది. ఇది ఏరియల్ మానిటరింగ్ కు సహాయపడుతుంది. ప్రాజెక్ట్ ఆపరేషన్ ను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడనుంది.

Cargo Ship: ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ హైజాక్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల చర్య

కాగా.. సొరంగంలో  41 మంది కార్మికులకు మల్టీవిటమిన్లు, యాంటిడిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ పంపుతున్నట్లు రోడ్డు, రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం ‘ఇండియా టుడే’తో తెలిపారు. ఆదివారం సంఘటనా స్థలాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ యంత్రంతో శిథిలాల మధ్య అడ్డంగా ప్రయాణించడం ఉత్తమ మార్గంగా కనిపిస్తోందని అన్నారు. మరో రెండున్నర రోజుల్లో పురోగతి వస్తుందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios