మూడు గంటల పాటు భార్యను ఇంట్లో బంధించి చితకబాదడంతో ఆమె చనిపోయింది. ఈ అమానుష ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కొన్నేళ్లుగా ఆమెను వేధింపులకు గురి చేశాడు. అతడు పెట్టే చిత్ర హింసలన్నీ ఆమె భరిస్తూ వచ్చింది. కానీ ఒక రోజు అతడు అమానుషంగా ప్రవర్తించాడు. మూడు గంటల పాటు భార్యను నిర్ధాక్షిణంగా చితకబాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం తలఘట్టపుట్టర ప్రాంతంలోని నాగే గౌడన పాళ్యలో 50 ఏళ్ల మారెప్ప తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి భార్య పద్మ (48), గిరీష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే కొంత కాలంగా అతడు భార్యను అనుమానిస్తున్నాడు. దీంతో అనేక సార్లు ఆమెతో గొడవపడ్డాడు. తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు. అయినా అవన్నీ ఆమె భరిస్తూ వచ్చింది.
శుక్రవారం ఉదయం కూడా ఎప్పటిలాగే ఆమెను చిత్రహింసలు పెట్టాడు. కొడుకు ముందే ఆమెను తీవ్రంగా కొట్టాడు. సాయంత్రం 4 గంటల సమయంలో కొడుకు గిరీష్ బయటకు వెళ్లాడు. దీంతో అప్పుడు ఆ ఇంటి డోర్ ను మారెప్ప లాక్ చేశాడు. ఆ సమమంలో కూడా ఆమెను హింసకు గురి చేశాడు. కుమారుడు మూడు గంటల తరువాత ఇంటికి వచ్చి చూశాడు. డోర్ కు లాక్ వేసి ఉంది. కిటికిలో నుంచి చూస్తే తల్లి స్పృహ కోల్పోయి కనిపించింది. డోర్ తెరవాలని తండ్రిని బతిమిలాడాడు. కానీ అతడు వినిపించుకోలేదు. దీంతో ఇరుగు పొరుగు వారిని సాయం అడిగేందుకు బయటకు వెళ్లాడు. వారు వచ్చినా కూడా అతడు స్పందించలేదు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడే మారెప్ప తలుపులు తీశాడు.
వెంటనే కుమారుడు, ఇరుగు పొరుగు వారు లోపలికి పరిగెత్తారు. కానీ ఆ సమయానికే ఆమె చనిపోయింది. దీంతో కుమారుడు తీవ్రంగా రోదించాడు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. “ నేను బయటకు వెళ్లకముందే మా నాన్న అమ్మని కొట్టాడు, వాళ్ళు రోజంతా గొడవ పడ్డారు. ఆమెకు వంట కూడా రాదు. నేను సాయంత్రం 6.30 గంటలకు తిరిగి వచ్చినప్పుడు, ఆమె మంచం మీద అపస్మారక స్థితిలో కనిపించింది. చాలా కాలం నుంచి మా నాన్న మా అమ్మను హింసిస్తున్నాడు. అతను ఆమెను చెక్క కర్రతో కూడా కొట్టేవాడు.” అని గిరీష్ ఫిర్యా దులో పేర్కొన్నాడు. మారెప్పపై చట్ట పట్టరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
గిరీష్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మారెప్ప కొన్నాళ్లుగా భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ‘‘ అతడు తన భార్యను అనుమానించాడు. నిరంతరం వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో బంధువులు, ఇరుగుపొరుగు ఎంతో చెప్పి చూసినా వారి సలహాలను అస్సలు పట్టించుకోలేదు. ఆమెను తరచూ కొట్టేవాడు. శుక్రవారం ఉదయం వారి మధ్య గొడవ ప్రారంభమైంది. సాయంత్రం వరకు అది కొనసాగింది. భర్త పెట్టె చిత్రహింసలు భరించలేక ఆమె మృతి చెందింది. అంతకు ముందు రోజు కూడా దంపతులు గొడవపడ్డారని తెలిపారు.
