హర్యానాకు చెందిన తులసి రామ్.. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య రామ్ దేవి, కుమారుడు పేరున 1968లో వీలునామా రాశారు. తన ఆస్తిని ఆమె జీవితకాలమంతా అనుభవిస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం మాత్రం యావదాస్తి సంపూర్ణంగా తన కుమారుడికే చెందాలని అందులో స్పష్టం చేశాడు. తరువాత తులసీరామ్ 1969లో మృతి చెందాడు. అయితే, కొందరు వ్యక్తులు రామ్ దేవి నుంచి ఆ ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది.
ఢిల్లీ : హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లు చేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా.. పరిమితులతో కూడిన testament రాసిన పక్షంలో సదరు Propertyపై ఆమెకు సంపూర్ణ హక్కులు దఖలు పడవు అని Supreme Court స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్ ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. హర్యానాకు చెందిన తులసి రామ్.. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య రామ్ దేవి, కుమారుడు పేరున 1968లో వీలునామా రాశారు.
తన ఆస్తిని ఆమె Lifetime అంతా అనుభవిస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం మాత్రం యావదాస్తి సంపూర్ణంగా తన కుమారుడికే చెందాలని అందులో స్పష్టం చేశాడు. తరువాత తులసీరామ్ 1969లో మృతి చెందాడు. అయితే, కొందరు వ్యక్తులు రామ్ దేవి నుంచి ఆ ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది.
చివరికి ఈ వ్యాజ్యం సుప్రీం కోర్టుకు చేరింది. ‘రాందేవి నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుకూలంగా Sale Deed లను కొనసాగించలేం’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఒక కేసులో Uttarakhand హైకోర్టు పై Baseless allegations చేసిన వ్యక్తి కోర్టు ఖర్చుల కింది రూ. 25 లక్షలు చెల్లించాలని జనవరి 4న తామిచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించుకుంది. ‘ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడాలి. ఈ సందేశం అత్యంత బలంగా.. స్పష్టంగా వెళ్లాలి. అందుకే ఈ అదేశాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు’ అని జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ సి.టి. రవికుమార్ ల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తన పొరపాటు తెలుసుకున్నారని, భవిష్యత్తులో అత్యంత జాగ్రత్తగా ఉంటారని, Court costs మొత్త మీద ఔదార్యం చూపించాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
తానొక పింఛన్ దారుడినని, ఒక నెల పింఛన్ కోర్టులో జమ చేస్తానని, రూ. 25 లక్షలు కట్టడం తనవల్ల కాదని న్యాయవాది ద్వారా పిటిషన్ దారుడు తెలిపారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ.. నిజానికి తాము కోర్టు ధిక్కారణ చర్యల్ని ఆయన మీద ఇప్పటికే మొదలు పెట్టి ఉండాలని, అలా చేయలేదని తెలిపింది. ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను వారం రోజుల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది.
మైనారిటి విద్యాసంస్థల చట్టం మీద అఫిడవిట్ ఆలస్యం మీద కూడా సుప్రీం కోర్టు అసంతృత్తి వ్యక్తం చేసింది.‘మైనారిటీ విద్యాసంస్థల చట్టం- 2004’లో సెక్షన్ 2 (ఎఫ్) చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం మీద సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఖర్చుల రూపేణా రూ. 7,500 చెల్లించి దీనికి దాఖలు చేయడానికి ప్రభుత్వానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం సోమవారం తెలిపింది.
