Asianet News TeluguAsianet News Telugu

లూథియానాలో పేలుడుకు పాల్పడిన వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి- పంజాబ్ డీజీపీ

పంజాబ్ లోని లూథియానా కోర్టులో పేలుడుకు పాల్పడిన నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెళ్లడించారు. 

The victims of the blast in Ludhiana have links with terrorist organizations- Punjab DGP
Author
Punjab, First Published Dec 25, 2021, 4:14 PM IST

LUDHIANA BLAST : పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టులో పేలుడుకు పాల్పడిన నిందితులకు ఖ‌లిస్తానీ, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పంజాబ్ డీజీపీ లూథియానా పేలుడు నిందితులకు ఖలిస్తానీ అంశాలు డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. లూథియానా పేలుడు కేసులో మరణించింది మాజీ హెడ్ కానిస్టేబుల్  గగన్‌దీప్ సింగ్ అని నిర్ధారించారు. మృతుడికి ఖలిస్తానీ, సరిహద్దులోని ఉగ్రవాద సంస్థలు, మాఫియా సంస్థలు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అత‌డు 2019లో డ్ర‌గ్స్ అక్రమ రవాణా కేసులో ఎస్టీఎఫ్ అరెస్టు చేసింద‌ని తెలిపారు. అప్ప‌టి నుంచి జైలులో ఉన్నాడ‌ని చెప్పారు. రెండేళ్ల క్రిత‌మే అత‌డిని పంజాబ్ పోలీసు డిపార్ట్‌మెంట్ స‌ర్వీసు నుంచి తొల‌గించింద‌ని తెలిపారు. అత‌డిని డ్ర‌గ్స్ కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ‌లో ఉంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే కోర్టుకు వ‌చ్చిన నిందితుడు త‌న వెంట పేలుడు ప‌దార్థాల‌ను మోసుకొని వ‌చ్చాడ‌ని తెలిపారు. మృతుడి వ‌ద్ద నుంచి సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు.

అంత‌కు ముందు పేలుడు ఘ‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిని సమీక్షించడానికి సీపీలు, ఎస్‌ఎస్‌పీలందరితో డీజీపీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉంచ‌డానికి ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా కార్యాచరణ ప్రారంభించాల‌ని అన్నారు. రాష్ట్రంలో మ‌త సామరస్యం కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, సరఫరాదారులను అణిచివేయాల‌ని అన్నారు. బెయిల్ ముగిసినా ఇంకా తిరుగుతున్న వారిని, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కేసుల్లో ఉన్న వ్యక్తులను అరెస్టు చేయడానికి దాడులు నిర్వ‌హించాల‌ని ఆదేశించాడు. అన్నిసున్నితమైన ప్రదేశాలలో నిఘా ఉంచాలని, అద‌న‌పు పోలీసు బ‌ల‌గాల‌ను రంగంలోకి దించాలని చెప్పారు. 

మహారాష్ట్ర విలవిల: ఓవైపు ఒమిక్రాన్, మధ్యలో కోవిడ్.. ఒకే స్కూల్‌లో 19 మంది పిల్లలకు పాజిటివ్

ఈ నెల 23వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న వ‌ల్ల పంజాబ్ ఒక్క సారిగా ఉలిక్కిప‌డింది. ఈ పేలుడు నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. రాష్ట్రం మొత్తం రెడ్ అలెర్ట్ విధించింది. మరోవైపు పేలుడు ఘటనపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని మినిస్ట్రీ ఆఫ్ హోం ఆఫైర్స్ పంజాబ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్న పంజాబ్ రాష్ట్ర పోలీసులు.. వేగ‌వంతంగా ద‌ర్యాప్తు నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న‌లో పాల్ప‌డిన వారు ఎవ‌రై ఉంటార‌న్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. పేలుడు సంభ‌వించిన వెంట‌నే పోలీసులు హుటా హుటినా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మ‌ళ్లీ అక్క‌డ పేలుడు సంభ‌వించకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఎన్‌సీజీ బృందాల‌ను కూడా అక్క‌డికి చేర‌వేశారు.

తమిళనాడులో దారుణం: భార్య లేని సమయంలో.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

ఈ ఘ‌ట‌న‌లో దేశ వ్య‌తిరేఖ శ‌క్తుల పాత్ర ఉండే అవ‌కాశం ఉంద‌ని ఘ‌ట‌న జ‌రిగిన రోజే సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ అనుమానం వ్య‌క్తం చేశారు. పంజాబ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో విధ్వంసం సృష్టించ‌డానికి ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు. ఘ‌టన జ‌రిగిన కొంత స‌మయం తరువాత అక్క‌డికి డిప్యూటీ సీఎం  సుఖ్‌జీంద‌ర్ సింగ్ రంధావా చేరుకున్నారు. పంజాబ్ అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు ఉన్న రాష్ట్రం. బ‌య‌టి శక్తులు ఈ ఘ‌ట‌న చేయ‌లేద‌నే విష‌యాన్ని తోసిపుచ్చ‌లేమ‌ని అన్నారు. త‌మ పోలీసులు ఈ కేసును త్వ‌ర‌గానే ఛేదిస్తార‌ని చెప్పారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios