దొంగతనం చేసేందుకు షాప్ లోకి దూరిన దొంగ అక్కడ అమర్చిన సీసీ కెమెరాను చూసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
సాధారణంగా దొంగలంతా ఎలా ఉంటారు ? ఎవరికీ తెలియకుండా, చడీచప్పుడు కాకుండా దొంగతనం చేసి అక్కడి నుంచి మెళ్లగా జారుకుంటారు. ఒక వేళ చోరీ చేసిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంటే ఎక్కడ దొరికపోతామేమోనని తెగ టెన్షన్ పడుతారు. కానీ ఈ దొంగ మాత్రం ప్రత్యేకం. దొంగతనం చేసేందుకు ఓ షాప్ లోకి దూరాడు. క్యాష్ కౌంటర్ నుంచి డబ్బు దోచుకున్నాడు. ఆ తరువాత అతడు సీసీ కెమెరాను గమనించాడు. అంతే.. తనను ఎవరూ పట్టుకోలేరని ధీమానో లేక వచ్చిన పని సక్సెస్ అయ్యిందన్న సంతోషమో తెలియదు గానీ ఫుల్ జోష్ లో స్టెప్పులేశాడు. అలాగే డ్యాన్స్ చేస్తూ షాప్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ప్రాంతంలో ఈ విచిత్ర చోరీ జరిగింది. అన్షు సింగ్ అనే వ్యక్తికి ఈ చందౌలీ మార్కెట్ లో ఓ హార్డ్‌వేర్ దుకాణం ఉంది. అయితే ఏప్రిల్ 16వ తేదీన తెల్లవారుజామున ఈ హార్డ్‌వేర్ దుకాణాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ దొంగ అందులోకి చొరబడ్డాడు. ముందుగా క్యాష్ కౌంటర్‌లో దొరికిన వస్తువులను తీసుకున్నాడు. ఆ తరువాత అటూ ఇటూ తిరిగాడు. ఆ సమయంలో అతడు దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాను గమనించాడు. అంతే ఆ సీసీ కెమెరా చూసి అతడు భయపడలేదు సరికదా ఆనందంగా డ్యాన్స్ చేశాడు. కొద్ది సేపు ఫుల్ జోష్ లో స్టెప్పులేశాడు.
దొంగతనం చేసిన డ్యాన్స్ లో ఇలా ఎందుకు డ్యాన్స్ చేశాడో అతడికి మాత్రమే తెలుసు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో, చోరీ చేసిన సమయంలో అతడు తన ముఖాన్ని గుడ్డతో చుట్టేసుకున్నాడు. దీంతో ఆ దొంగను గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. ఆ డ్యాన్స్ చేస్తున్న ఊపులోనే ఆ షాప్ లో నుంచి బయటపడ్డాడు. ఈ దృశ్యాలన్నీ ఆ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ బయటకు రావడంతో ఇది ప్రస్తుతం వైరల్ మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది.
చోరీ జరిగిన మరుసటి రోజు ఉదయం ఆ హార్డ్ వేర్ షాప్ యజమాని అన్షు సింగ్ అక్కడికి చేరుకున్నాడు. షాప్ షట్టర్ పగలగొట్టి ఉండడాన్నిగమనించాడు. లోపలికి వెళ్లి చూశాడు. కౌంటర్ లో నగదు కనిపించలేదు. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ వింత దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆయన చందౌలీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
