బైక్ ను ముట్టుకున్నాడని ఓ టీచర్ దళిత విద్యార్థిని దారుణంగా గదిలో బంధించి చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. టీచర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కులతత్వం, అంటరానితనం వంటి నిస్పృహలు ఇంకా మ‌న స‌మాజాన్ని వ‌ద‌ల‌డం లేదు. కుండ‌లో నీళ్లు తాగాడ‌ని ఓ ద‌ళిత విద్యార్థిని ఓ టీచ‌ర్ కొట్ట‌డంతో ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పొయాడు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఇది పూర్తిగా ఇంకా మ‌రిచిపోక‌ముందే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. బైక్ ను ముట్టుకున్నాడ‌ని ఓ ద‌ళిత విద్యార్థిని టీచ‌ర్ దారుణంగా చిత‌క‌బాదాడు. 

ద్రవ్యోల్బణం, జీఎస్టీపై నేడు కాంగ్రెస్ భారీ నిర‌స‌న‌.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా ర్యాలీ

పోలీసులు, బాధిత విద్యార్థి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బల్లియా జిల్లాలోని నాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపుర నం. 2 గ్రామానికి చెందిన వివేక్ రాణాపూర్‌లోని హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆ విద్యార్థి చేయి టీచ‌ర్ కృష్ణమోహన్ శర్మ బైక్ ను తాకింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అత‌డు ఆ విద్యార్థి కాల‌ర్ ప‌ట్టుకొని వెళ్లి ఓ గ‌దిలో బంధించాడు.

ద‌ళిత బాలిక‌లు వ‌డ్డించార‌ని మిగితా విద్యార్థుల భోజ‌నం పారేయించిన వంట మ‌నిషి.. రాజ‌స్థాన్ లో ఘ‌ట‌న

ఆ స‌మ‌యంలో ఇనుప రాడ్ తీసుకొని బాలుడిపై దాడి చేశాడు. అలాగే చీపుతో కూడా కొట్టి మెడపై కూడా గ‌ట్టిగా నొక్కాడు. దీంతో మిగితా ఉపాధ్యాయులు, విద్యార్థులు జోక్యం చేసుకుని ఆ పిల్లాడిని రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలలో ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో నగారా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి దేవేంద్రనాథ్‌ దూబే, బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని వారికి న‌చ్చ‌జెప్పారు. ఆందోళ‌న‌ల‌ను శాంతింప‌జేశారు. దళిత విద్యార్థి తల్లి కౌశీల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు కృష్ణమోహన్ శర్మపై కేసు నమోదు చేసిన‌ట్టు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దేవేంద్రనాథ్ దూబే తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చి.. పోలీస్ స్టేష‌న్ లోనే నిప్పంటించుకున్న యువ‌తి.. ఎందుకంటే ?

ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి మణిరామ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విష‌యంలో బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ప్రాథమిక విచారణ జరిపారని, అందులో ఉపాధ్యాయుడు ప్రాథ‌మికంగా దోషిగా తేలాడ‌ని తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడు కృష్ణమోహన్ శర్మను తక్షణమే సస్పెండ్ చేసినట్లు చెప్పారు.