Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికల‌ మృతి కేసు ద‌ర్యాప్తును సోరెన్ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంది - ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక క‌నూంగో

గత నెలలో, ఈ నెలలో జార్ఖండ్ లో ఇద్దరు బాలికలు దారుణ హత్యకు గురయ్యారు. వీటిపై దర్యాప్తు జరపడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆ రాష్ట్రానికి చేరుకుంది. అయితే తమ దర్యాప్తుకు సోరెన్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆ కమిషన్ చీఫ్ ఆరోపించారు. 

The Soren government is blocking the investigation of the death of minor girls - NCPCR Chief Priyanka Kanungo
Author
First Published Sep 5, 2022, 3:34 PM IST

దుమ్కాలో ఇద్ద‌రు మైన‌ర్ బాలిక మృతిపై దర్యాప్తును హేమంత్ సోరెన్ ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో అన్నారు. త‌మ ప‌ర్య‌ట‌న విష‌యాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని, అయినా విచారణకు సాయం చేయ‌డానికి అవసరమైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. 

లిక్కర్ బ్రోకరేజ్, కమీషన్ తీసుకోవడమే కేజ్రీవాల్ మిషన్: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

‘‘ నేను రెండు కేసులను విచారించడానికి దుమ్కాకు వచ్చాను. నా పర్యటన వివరాలను జార్ఖండ్ ప్రభుత్వానికి చాలా ముందుగానే తెలిజేశాం. అత్యాచారం జ‌రిగిన త‌రువాత చెట్టుకు వేళాడుతూ క‌నిపించిన బాలిక కుటుంబాన్ని NCPRC బృందం కలవాలనుకుంది. దీనికి కలెక్టర్ అనుమ‌తి ఇచ్చారు. మేము ఆ గ్రామానికి వెళ్లాం. అయితే బాధిత బాలిక త‌ల్లిదండ్రుల ఆచూకీ ల‌భించ‌లేదు’’ అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) చైర్‌పర్సన్ ట్వీట్ చేశారు.

బాధిత బాలిక త‌ల్లిదండ్రుల‌ను ఎవ‌రో కారులో ఎక్క‌డికో తీసుకెళ్లార‌ని ఇరుగుపొరుగు వారు త‌మ బృందానికి తెలిపార‌ని కానుంగో పేర్కొన్నారు. ‘‘ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించ‌డం ఇష్టం లేదు.  ద‌ర్యాప్తును అడ్డుకుంటోంది ’’ అని ఆయన తెలిపారు. కాగా.. దుమ్కా జిల్లాలో మొద‌టి ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 ఏళ్ల గిరిజన బాలికను ఓ వ్య‌క్తి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఆమెపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఏం జ‌రిగిందో తెలియ‌దు గాని గ‌త శుక్ర‌వారం రోజు ఆమె అనుమాన‌స్ప‌దంగా చెట్టుగా వేలాడుతూ మృతి చెంది క‌నిపించింది. అయితే త‌న కూతురును అర్మాన్ అన్సారీ అని వ్య‌క్తి అత్యాచారం చేసి, హ‌త్య  చేశాడ‌ని బాధితురాలి త‌ల్లి ఆరోపించింది.

టీచర్స్ డే:బాల్యం నుండి భవిష్యత్తుకు పునాది వేసేది గురువులే

ఈ ఘ‌ట‌న‌లో నిందితుడైన అర్మాన్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. అత‌డు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడని పోలీసు సూపరింటెండెంట్ అంబర్ లక్రా తెలిపారు. నిందితుడిపై IPC సెక్షన్లు 376 (అత్యాచారం), 302 (హత్య), SC/ST చట్టం, POCSO చట్టంలోని నిబంధనల ప్రకారం అభియోగాలు మోపి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. 

సైరస్ మిస్త్రీ పోస్ట్‌మార్టం నివేదిక విడుదల... మరణానికి కార‌ణ‌మేమిటంటే..?

అలాగే ఆగ‌స్టు 23వ తేదీన 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేయాల‌ని ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నించాడు. దీనికి ఆమె తిర‌స్క‌రించ‌డంతో ఆగ్ర‌హంతో నిందితుడు బాలిక‌కు నిప్పంటించారు. అయితే ఆమెను హాస్పిటల్ కు త‌ర‌లించారు. ఐదు రోజుల పాటు హాస్పిట‌ల్ లో చికిత్స పొందిన బాలిక ప‌రిస్థితి విషమించ‌డంతో మృతి చెందింది. ఈ బాలిక మృతి కేసుపై ద‌ర్యాప్తు చేయ‌డానికి NCPRC బృందం అత్యాచారం ఆ రాష్ట్రానికి చేరుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios