Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ పోస్ట్‌మార్టం నివేదిక విడుదల... మరణానికి కార‌ణ‌మేమిటంటే..? 

టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక విడుదలైంది. మిస్త్రీ తలకు బలమైన గాయం కారణంగా మృతి చెందారు.  

cyrus mistry post mortem report released
Author
First Published Sep 5, 2022, 2:29 PM IST

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. చెందాడు. ఆయ‌న‌ మహరాష్ట్రలోని అహ్మదాబాద్ నుంచి ముంబాయి ప్రయాణిస్తుండగా.. పాల్గర్ సమీపంలోని చరోటి దగ్గర అతివేగంతో ప్రయాణిస్తున్న ఆయ‌న కారు అదుపుతప్పి.. డివైడర్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. అయితే.. తాజాగా సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను వైద్యులు విడుదల చేశారు. నివేదిక ప్రకారం.. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ కారు డివైడర్‌ను ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. 
  
ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. కారు ప్ర‌మాదంలో సైరస్, అతని స్నేహితుడు జహంగీర్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. అదే స‌మ‌యంలో అనేక అంతర్గత అవయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. తొలుత మిస్త్రీకి హాజరైన వైద్యుడు శుభం మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో తొలి పోస్టుమార్టం నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చిందని, నిపుణుడి అభిప్రాయం కోసం జేజే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. 

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. పాల్ఘర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా మ‌రో కారును ఓవ‌ర్ టెక్ చేసే క్ర‌మంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో నలుగురు వ్యక్తులు ఉండగా.. వారిలో మిస్త్రీ సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.

అతివేగం వల్లే ప్రమాదం 

ఈ ప్ర‌మాదంపై పా ల్ఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) బాలాసాహెబ్ పాటిల్ మాట్లాడుతూ... ప్రమాదానికి కారణం అతివేగమేన‌నీ, దీంతో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని తెలిపారు. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.. విచారణ తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని, అయితే అతివేగం, డ్రైవర్‌ సరైన తీర్పు రాకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ప్రమాద స‌మ‌యంలో కారులో న‌లుగురు ప్ర‌యాణిస్తున్నార‌నీ, మ‌హిళ వైద్యురాలు కారును న‌డిపిన‌ట్టు పోలీసులు గుర్తించారు. కారులో ముందు సీట్ల‌లో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవ‌డంతో తీవ్ర గాయాలు అయిన‌ప్ప‌టికీ ప్రాణాల‌తో భయ‌ప‌డ్డారు. వెన‌క సీటులో కూర్చున్న మిస్త్రీ స‌హా ప్ర‌యాణీకుడు ఇద్ద‌రూ అక్క‌డిక్క‌డే మర‌ణించిన‌ట్టు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios