ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో ఓ కుమారుడు తండ్రిని హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, సూట్ కేసులో పెట్టి బయటకు పారేయబోయాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. 

ఆస్తి తగదాలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. సొంత కుమారుడే తండ్రిని దారుణంగా నరికి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీనికి ముక్కలుగా చేశాడు. వాటిని సూట్ కేసులో పెట్టి, బయట పారేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

భారతీయులందరినీ సంతోషంతో ముంచెత్తినందుకు ధన్యవాదాలు : ఆర్ఆర్ఆర్ టీమ్ కు వెంకయ్య నాయుడు, ఖర్గే అభినంద‌న‌లు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌లోని తివారీపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీలో 62 ఏళ్ల మురళిధర్ గుప్తా నివసిస్తున్నాడు. అతడి భార్య కోవిడ్ సమయంలో మరణించింది. మరళి గ్రౌండ్ ఫ్లోర్‌లో జనరల్ స్టోర్ నడుపుతూ తన ఇంటి మొదటి అంతస్తులో ఉండేవాడు. అతడికి సంతోష్‌ అలియాస్‌ ప్రిన్స్‌.. ప్రశాంత్ గుప్తా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

అయితే కొంత కాలంగా పెద్ద కొడుకు, తండ్రి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తండ్రిని పెద్ద కుమారుడు శనివారం రాత్రి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డెడ్ బాడీని బయట పారేయాలని భావించాడు. దీని కోసం తండ్రి డెడ్ బాడీని అతడు ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ సూట్ కేసులో పెట్టాడు. ఆ సూట్ కేసును ఇంటికి సమీపంలోని ఓ వీధిలో దాచి పెట్టాడు.

పార్లమెంట్ సమావేశాలు: రాహుల్ భారత్‌ను అవమానించారు.. సభ ముందు క్షమాపణ చెప్పాలి: రాజ్‌నాథ్ సింగ్

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న చిన్న కుమారుడికి తండ్రి కనిపించలేదు. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అతడికి అనుమానం వచ్చింది. తండ్రి కోసం ఎంతగా గాలించిన దొరకలేదు. అనంతరం పోలీసుల సాయం తీసుకున్నారు. తన తండ్రి హత్యకు గురై ఉంటాడని అతడు పోలీసుల దగ్గర అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు పెద్ద కుమారుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని కఠినంగా విచారించడంతో నిందితుడు నేరం అంగీకరించాడు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. 

తండ్రిని హత్య చేశాడనే అభియోగాలతో సంతోష్ అలియాస్ ప్రిన్స్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్పీ (నగరం) కృష్ణ కుమార్‌ బిష్ణోయ్‌ ధృవీకరించారు. నిందితుడు చెప్పిన వివరాలతో ఇంటికి సమీపంలో ఉన్న సూట్ కేసు నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు పంపించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.

హర్యానాలో విషాదం.. రిషికేశ్‌లోని గంగానదిలో రాఫ్టింగ్ చేస్తూ టూరిస్ట్ మృతి..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విరార్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. బాధితురాలిని 44 ఏళ్ల వైశాలి ధనుగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట ఓ వివాహ కార్యక్రమంలో ఏదో అంశంపై తల్లీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదో విషయంలో మళ్లీ గొడవ జరగడంతో ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పినట్టు వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది.