Ram Mandhir: బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’.. ఆ అద్భుతం ఎలా సాక్షాత్కరమైందో తెలుసా?
Ram Mandhir: శ్రీరామనవమి రోజున అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం సాక్షాత్కమైంది. బాలరాముడి నుదిటిపై ఆ ఆదిత్యుడు తన కిరణాలతో సూర్య తిలకం(Surya Tilak) దిద్దాడు. రామ మందిర నిర్మాణం తర్వాత తొలిసారి ఆవిష్కృతమైన ఈ అద్భుత ఘట్టాన్ని చూసి రామ భక్తులు పులకించిపోయారు. ఈ అద్భుత దృశ్యం ఎలా సాక్షాత్కరమైందో తెలుసుకుందాం..
Ram Mandhir: నేడు శ్రీరామనవమి.. దేశవ్యాప్తంగా భక్తులు భక్తి భావంతో మునిగి తేలుతున్నారు. ఎక్కడ చూసినా.. ఏ రామాలయం చూసిన జైశ్రీరామ్ అనే నామస్మరనే వినిపిస్తోంది. భక్తులంతా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. కాగా.. ఈ ఏడాది అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు చాలా ప్రత్యేకం. అయోధ్యలోని బాలరాముని విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు వేద పండితులు. శ్రీరామనవమి రోజున అయోధ్యలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ సూర్యకిరణాలు బాల రాముని నుదుటిపై నేరుగా తాకి తిలకం(Surya Tilak)గా మారాయి. దీంతో.. ఆ బాల రాముడి విగ్రహం నీలా రంగులోకి మారింది. ఈ అద్బుత దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తులు పులకించిపోయారు. శ్రీరామనవమి రోజున మాత్రమే ఈ అద్బుత ఘట్టాన్ని తిలకించే అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ వచ్చే ఏడాది శ్రీరామనవమి రోజునే సాక్షాత్కరిస్తుంది.
అద్భుత ఘట్టం
ఆ బాల రాముడి నుదిటిపై సూర్యకిరణాలు నేరుగా పడేవిధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించారు. ప్రతి యేటా శ్రీరామనవమి రోజున మాత్రమే ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అంటే.. శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు ఆయన నుదుటిపై వెలిగేలా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగించారు. సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడు 58 మిల్లీమీటర్ల పరిమాణంలో దాదాపు 3:30 నిమిషాల పాటు ప్రసరించాయి.
ఆ అద్భుతం ఎలా జరిగిందంటే?
సూర్యకిరణాలు బాలరామచంద్రుడి నుదుటిపై ప్రసరించేలా ఆలయం నిర్మాణ సమయంలోనే ప్రత్యేక కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలను ఏర్పాటు చేశారు. మూడవ అంతస్తు నుండి నేరుగా బాలరాముడు ఎదుటి పై కిరణాల ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు. తొలుత సూర్యకిరాణాలు మూడవ అంతస్తుల్లో ఆమర్చిన అద్దంపై పడ్డాయి. ఆ కిరణాలు అక్కడి నుంచి ఇత్తడి పైపు లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఆ ఇత్తడి పైప్లో అమర్చబడిన మరో అర్ధాన్ని తాకి 90 డిగ్రీల వద్ద మళ్ళీ ప్రతిబింబిస్తాయి. ఆ తర్వాత ఇత్తడి పైపు గుండా వెళ్లే ఈ సూర్య కిరాణాలు మూడు వేరు వేరు లెన్సుల గుండా ప్రవహించి.. ఓ పొడవైన పైపు ద్వారా గర్భగుడి చివర అమర్చిన అర్ధాన్ని తాగుతాయి.
అలా వచ్చిన కిరణాలు నేరుగా బాలరాముడు నుదుటిపై పడి తిలకం లాగా ప్రకాశిస్తాయి. ఆ సమయంలో గర్భగుడిలోని విద్యుత్ దీపాలను ఆఫ్ చేసి హారతి సమర్పించారు.బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పనిచేశారు. బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. రాములల్లా నుదుటిపై సూర్య తిలకం దిద్దిన అద్భుత దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఆ సమయంలో బాల రాముడు చూసి భక్తులు పరవశించిపోయారు. అయోధ్యలో రాములల్లకు ప్రతిష్టాపన తర్వాత ఇదే తొలి రామనవమి కావడంతో అయోధ్యలో ఈ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది.సూర్య తిలక దర్శనం కోసం అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చారు. బాల రాముని నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతమైన దృశ్యాన్ని కనువిందుగా తిలకించారు.
19 యేండ్లు నిరాటంకంగా ..
ప్రతి ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణం లో మార్పుల సంగతేమిటి ? గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధికమించేందుకు గడియారం ముల్లులు తిరిగే పరిజ్ఞానం తరహాలో గేర్ టిప్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతి గ్రహించే పరికరం వద్ద మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామనవమి రోజు వారు అనుకున్న చోటుకి తీసుకొస్తుంది. అంతకుముందే కాలాన్ని సెకండ్ లతో సహా లెక్కలు వేశారు ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 యేండ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.