గాంధీనగర్: కటింగ్ చేసిన వ్యక్తికి ఓ విదేశీయుడు రూ.28వేలను  చెల్లించాడు. హెయిర్‌ కటింగ్ చేసిన వ్యక్తి చూపిన నిజాయితీకి తాను ఈ బహుమతిని ఇచ్చినట్టుగా  విదేశీయుడు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నార్వేకు చెందిన హెరాల్డ్ బాల్టర్ ట్రావెల్ వీడియోలు తీస్తూ యూ ట్యూబర్‌గా ప్రసిద్ది చెందాడు. ఇటీవల ఆయన ఇండియాకు వచ్చాడు. ఇండియాలోని గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఆయన పర్యటించారు.

అహ్మదాబాద్‌లో రోడ్డు పక్కన  పుట్‌పాత్‌పై  హెయిర్ కటింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. బాల్టర్ తాను కటింగ్ చేయించుకొనేందుకు పుట్‌పాత్‌పై హెయిర్ కట్ చేసే వ్యక్తి వద్దకు వెళ్లాడు. అతని వద్ద తన హెయిర్ కట్ చేయించుకొన్నాడు. 

హెయిర్ కటింగ్ గురించి ఆయన వద్ద వివరాలను తెలుసుకొన్నారు. తనకు కటింగ్ చేసిన వ్యక్తితో బాల్టర్ సెల్పీ కూడ దిగాడు. హెయిర్ కటింగ్ చేసిన తర్వాత బాల్టర్ వద్ద రూ.20 మాత్రమే అడిగాడు.

దీంతో బాల్టర్ ఆశ్చర్యానికి గురయ్యాడు.  హెయిర్ కటింగ్ చేసిన వ్యక్తి నిజాయితీగా  తనను డబ్బులు అడిగినందుకు అతనికి రూ.20 వేలు ఇచ్చాడు. తన ప్రయాణంలో కలిసిన మంచి వ్యక్తికి అదనంగా బహుమతి ఇచ్చినట్టు బాల్టర్ చెప్పారు. ఆ డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కోవాలని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించాడు.