ఇక నెక్ట్స్ ఎన్ ఆర్సీనే.. అప్పుడు ప్రజలంతా భారతీయులమని నిరూపించుకోవాలి - ఎంపీ ఎస్టీ హసన్

ఎన్ ఆర్సీకి సీఏఏ ఒక ముందడుగు మాత్రమే అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ అని అన్నారు. ఎన్నికల ముందు ప్రజల దృష్టి మరల్చే ఒక ఎత్తుగడ అని విమర్శించారు.

The next NRC. Then people should prove that they are Indians: MP ST Hassan..ISR

సీఏఏను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫై చేసింది. దీంతో పౌరసత్వ (సవరణ) చట్టం -2019 నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీనిపై సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ ఎస్టీ హసన్ అనుమానం వ్యక్తం చేశారు. సీఏఏ కేవలం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కు పునాది వేస్తోందని, అప్పుడు ప్రజలు తాము భారతీయులమని నిరూపించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

హైదరాబాద్ మీర్ ఆలం చెరువుపై రెండో కేబుల్ బ్రిడ్జి

ఎన్ఆర్సీ ద్వారా కోట్లాది మంది ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. సీఏఏ తదుపరి దశ ఎన్ఆర్సీయేనని తెలిపారు. ఇది కేవలం ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ, ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు.ప్రజలకు పౌరసత్వం ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. కానీ అందులో మతాన్ని ఎందుకు నిర్వచించారని అన్నారు. చట్టంలో పేర్కొన్న దేశాల్లో ముస్లింలను హింసించడం లేదా?  నిజానికి ఈ మూడు దేశాల్లోనూ (పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్) అహ్మదీయులు హింసకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

అణచివేతకు గురైన వారందరికీ ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలపై విచారణ జరపాలని అన్నారు. ‘‘ఇక్కడికి వచ్చే వేధింపులకు గురైన వారందరిపై సరైన విచారణ జరపాలి. ఆ తర్వాత ఆయన ప్రవర్తనను చూసి ఆయనకు పౌరసత్వం ఇవ్వాలి. కానీ ముస్లింలను దీని నుండి వేరు చేశారు. వారు తమ దేశాలలో మెజారిటీగా ఉన్నారు. అక్కడ హింసించబడలేదు. ఇక్కడ దళితులను వేధించడం లేదా? వారు కూడా మెజారిటీలో ఉన్నారు. స్వతంత్ర భారతంలో తొలిసారిగా మతం ఆధారంగా వివక్ష చూపే చట్టం వచ్చింది. మత ప్రాతిపదికన ప్రజలను విభజించవద్దు’’ అని ఎస్టీ హసన్ తెలిపారు.

సీఏఏ ఆమోదయోగ్యం కాదు.. తమిళనాడులో అమలు చేయొద్దు - విజయ్ దళపతి

కాగా.. సీఏఏ అమలుపై శివసేన (యూబీటీ) అధికార ప్రతినిధి ఆనంద్ దూబే కూడా మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. దేశంలో అరాచక వాతావరణాన్ని సృష్టించి, ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రభావితం చేయడమే ఈ ఆకస్మిక అమలు వెనుక ఉద్దేశమని దుబే ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏమైనా చేయగలదని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను వారు పట్టించుకోరని అని ఆరోపించారు. ‘‘ఇదంతా జుమ్లాబాజీ. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలని వారు కోరుకోవడం లేదు’’ అని దూబే అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios