ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశాడని కొడుకును హతమార్చిన తల్లి.. పీడకలలు రావడంతో భర్తతో నిజం ఒప్పుకొని...
ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూశాడని ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడిని మేడపై నుంచి తోసేసింది. గాయాలతో ఆ బాలుడు చనిపోయాడు. అందరూ అది ప్రమాదమే అని భావిస్తున్న తరుణంలో.. తానే కుమారుడిని హత్య చేశానని ఆ మహిళ ఒప్పుకుంది.
ఓ మహిళకు పెళ్లయింది. మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమెకు పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక రోజు మేడపై వారిద్దరూ సన్నిహితంగా గడిపారు. దీనిని కుమారుడు గమనించాడు. ఈ విషయాన్ని ఎక్కడ కుమారుడు తన భర్తతో చెప్పేస్తాడేమో అని భయపడింది. దీంతో ఆ బాలుడిని మేడపై నుంచి తోసేయడంతో చనిపోయాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందరూ భావించారు. కానీ కొంత కాలం తరువాత ఆమె భర్తతో నిజం ఒప్పుకుంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జరిగింది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. గాల్వియర్ సిటీలోని ఓ కాలనీలో పోలీసు కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్ తన భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతడి భార్యకు పక్కింట్లో ఉండే ఉదయ్ ఇందౌలియాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అతడికి తెలియదు.
ఈ క్రమంలో ధ్యాన్ సింగ్ ఏప్రిల్ 28వ తేదీన తన ఇంటి దగ్గర ఓ ప్లాస్టిక్ షాపును ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు తన పొరుగింట్లో ఉన్న ఉదయ్ ఇందౌలియాతో సహా పలువురిని ఆహ్వానించాడు. దీంతో అతడు ఆ కార్యక్రమానికి వచ్చాడు. అందరూ ఈ వేడుకలో బిజీగా ఉండగానే ఉదయ్, తన ప్రియురాలితో కలిసి డాబాపైకి వెళ్లారు. అక్కడ వారిద్దరూ సాన్నిహితంగా మెలిగారు. అయితే తల్లిని వెతుక్కుంటూ మూడేళ్ల కుమారుడు కూడా డాబాపైకి వెళ్లాడు. అక్కడ తల్లిని, ఉదయ్ లు చాలా సాన్నిహితంగా ఉండటం చూశాడు.
దీంతో భయపడిన తల్లి.. తన వివాహేతర సంబంధాన్ని భర్తకు చెప్పేస్తాడేమో అని భయపడింది. కన్నకుమారుడు అని కూడా చూడకుండా ఆ బాలుడిని మేడపై నుంచి తోసేసింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 29న మరణించాడు. అయితే బాలుడు ప్రమాదవశాత్తు మేడపై నుంచి పడిపోయాడని తొలుత అందరూ భావించారు.
కాగా.. కొన్ని రోజుల తరువాత ఆ మహిళకు కుమారుడి గురించి పీడకలలు రావడం మొదలయ్యాయి. దీంతో ఆమె తను చేసిన నేరాన్ని భర్త దగ్గర ఒప్పుకుంది. తానే కుమారుడిని హతమార్చినట్టు అంగీకరించింది. దీంతో ధ్యాన్ సింగ్ ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి ఆమెను, ప్రియుడు ఇందౌలియాను అరెస్టు చేశారు.